Published : Feb 06, 2025, 01:09 PM ISTUpdated : Feb 06, 2025, 01:14 PM IST
Ajithkumar Upset with Fans: పట్టుదల ( విడాముయర్చి) సినిమా ఈరోజు థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి అద్భుతమైన రెస్పాన్స్ ను సాధిస్తోంది. ఈక్రమంలో సంతోేషంలో ఎగిరి గంతేయ్యాల్సిందిపోయి అజిత్ అప్ సెట్ గా ఉన్నారట. కారణం ఏంటంటే..?
నటుడు అజిత్ కుమార్ 30 ఏళ్లకు పైగా సినిమాల్లో నటిస్తున్నారు. సినీ నేపథ్యం లేకుండా వచ్చిన అజిత్ తన కష్టంతో తమిళ సినిమాలో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ గుర్తింపునిచ్చింది ఆయన అభిమానులే. తన అభిమానులంటే ఎంతో ప్రేమ గల అజిత్, వాళ్ళు తప్పు చేసినా అడ్డు చెప్పకుండా ఉండరు.
Also Read:
24
కడవులే అజిత్ అంటూ నినాదాలు
గతేడాది అజిత్ అభిమానులు ‘కడవులే... అజిత్’ అంటూ నినాదాలు చేసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ అభిమాన హీరో దేవుడితో సమానం అంటూ.. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా ఇలాగే నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఆలయాలకు వెళ్లినా అక్కడ కూడా ‘కడవులే... అజిత్’ అంటూ నినాదాలు చేసి భక్తులకు ఇబ్బంది కలిగించారు.
ఇలా తాను దేవుడినంటూ నినాదాలు చేస్తుంటే, సంగీత దర్శకుడు అనిరుధ్ తన పాటలో ఆ లైన్స్ వేశారు. దీంతో ‘కడవులే అజిత్’ నినాదాలు మరింత పెరిగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో, అజిత్ స్వయంగా రంగంలోకి దిగి అభిమానులకు హెచ్చరిక చేశారు. ఇకపై ‘కడవులే... అజిత్’ అని నినాదాలు చేయవద్దని చెప్పారు. అయినా కూడా అవి ఆగలేదు.
రెండేళ్ల గ్యాప్ తర్వాత అజిత్ నటించిన పట్టుదల (విడాముయర్చి) సినిమా విడుదలైంది. సినిమా చూడటానికి వచ్చిన అభిమానులు థియేటర్ ముందు సంబరాలు చేసుకున్నారు. మళ్ళీ ‘కడవులే అజిత్’ అంటూ నినాదాలు చేసి, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన మాట వినకుండా అభిమానులు మళ్ళీ ‘కడవులే అజిత్’ అంటూ నినాదాలు చేయడంతో అజిత్ అప్‌సెట్ అయ్యారట. సినిమా విడుదలైనా తన మాట వినలేదే అని బాధపడుతున్నారట.