ఇటీవల 20వ వివాహ వార్షికోత్సవం జరుపుకున్న సీరియల్ నటులు ఇంద్రనీల్, మేఘన ప్రేమకథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రముఖ సీరియల్‌లో అత్త అల్లుడగా నటించిన ఈ జంట నిజ జీవితంలో భార్యాభర్తలు. కానీ, 20 ఏళ్ళుగా వైవాహిక జీవితంలో పిల్లలు లేకపోవడం వారికి బాధ కలిగిస్తోంది. తెలుగులో విజయవంతమైన 'చక్రవాకం' సీరియల్‌లో ఇంద్రనీల్‌కి అత్తగా మేఘన నటించారు. 'చక్రవాకం' సీరియల్ ఎంతో ప్రజాదరణ పొందింది. ఈ సీరియల్ ప్రసార సమయంలో ప్రేక్షకులు టీవీ ముందు కూర్చునేవారు. చాలా సంవత్సరాలు నడిచిన ఈ ధారావాహిక టీఆర్‌పీ ఎప్పుడూ పైనే ఉండేది.
కరోనా సమయంలో దీన్ని మళ్ళీ ప్రసారం చేశారు. కానీ, మొదటిసారి ప్రసారమైనప్పుడు సీరియల్‌లో అత్త, అల్లుడుగా ఉన్న ఈ జంట, రెండోసారి ప్రసారమయ్యే సమయానికి నిజ జీవితంలో భార్యాభర్తలయ్యారు. అత్తనే పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో ట్రోల్ చేశారు. నిజ జీవితంలో మేఘన, ఇంద్రనీల్ కంటే వయసులో పెద్దది. వారి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించలేదు. ఇంద్రనీల్ కంటే మేఘన ఆరు నెలలు పెద్దది. సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. చివరికి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నా, ఇప్పటివరకు వారికి పిల్లలు కలగలేదు.