'ఛావా' సినిమా సక్సెస్ తర్వాత విక్కీ కౌశల్ కెరీర్ దూసుకెళ్తున్నా, ఆస్తి విషయంలో కత్రినానే చాలా ముందుంది. రిపోర్టుల ప్రకారం, కత్రినా ఆస్తి దాదాపు రూ. 224 కోట్లు కాగా, విక్కీ ఆస్తి సుమారు రూ. 41 కోట్లు. ఈ మధ్య తక్కువ సినిమాలు చేస్తున్నా, కత్రినా ఇప్పటికీ బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. '
టైగర్ 3' కోసం ఆమె రూ. 15 నుంచి 21 కోట్లు, 'మెర్రీ క్రిస్మస్' కోసం దాదాపు రూ. 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు, విక్కీ వరుస విజయాలతో తన స్థానాన్ని పదిలపరుచుకుంటున్నాడు. 'ఛావా' ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లు దాటడంతో, ఆ సినిమాకు విక్కీ రూ. 10 కోట్లు సంపాదించినట్లు తెలిసింది. 'బ్యాడ్ న్యూజ్', 'సామ్ బహదూర్', 'డంకీ' సినిమాల్లోని పాత్రలతో ఆయన సంపాదన కూడా పెరుగుతోంది.