ఏలూరులో మెయిన్ రోడ్డు మీద సావిత్రి వాళ్లకి చెందిన విజయ స్పిన్నింగ్ మిల్ ఉండేదట. చనిపోవడానికి ముందు కొన్నేళ్ల క్రితం అక్కడ ఏదో పనిమీద విజయవాడ వచ్చినప్పుడు సావిత్రి, సుశీల కలుసుకున్నారట. ఆ సమయంలో ఓపెన్ అయ్యిందట సావిత్రి. అప్పట్లో తనతో సుశీల రాలేదని కోపం ఉండేదట. ఆ విషయాన్ని చెబుతూ, `మొదట్లో నీ మీద కొప్పడ్డాను, కానీ ఆ తర్వాత నువ్వు రాకపోవడమే మంచిదైంది. నేను అక్కడికి వెళ్లాననే గానీ, కోట్లు సంపాదించినా సుఖం లేదు, సంతోషం లేదు, భర్త పట్టించుకోదు, నాకు తొచింది తినలేను, నచ్చింది కట్టుకోలేను, నేను దిక్కులేని దానినైపోయాను. నువ్వయ్యినా ఇక్కడ సుఖంగా భర్త, పిల్లలతో ఉన్నావ్ అంతే చాలు` అని బాధతో చెప్పిందట సావిత్రి.