Salman Khan: కెరీర్‌లో ఒక్క స్క్రిప్ట్ కూడా చదవలేదు.. భాయ్ చెప్పిన షాకింగ్ నిజం!

Published : May 17, 2026, 11:12 AM IST

సల్మాన్ ఖాన్ ఈ మధ్య ఓ మాటన్నారు. ఆ మాట విని బాలీవుడ్ మొత్తం షాకైంది. మూడు దశాబ్దాలుగా ఇండస్ట్రీని ఏలుతున్న భాయ్‌జాన్, తన సినిమాల స్క్రిప్ట్‌ల గురించి ఓ పెద్ద సీక్రెట్ బయటపెట్టారు. ఇంతకీ ఏంటా విషయం?

PREV
16
షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన సల్మాన్ ఖన్ ..

బాలీవుడ్ 'సుల్తాన్' సల్మాన్ ఖాన్ ఓ షాకింగ్ సీక్రెట్ బయటపెట్టారు. బాలీవుడ్ బాద్‌బాయ్, కోట్లాది అభిమానుల ఆరాధ్య దైవం సల్మాన్ ఖాన్ ఏం చేసినా అది పెద్ద వార్తే. ఆయన నడక, స్టైల్, ముక్కుసూటి మాటలకు అభిమానులు  ఫిదా అవుతారు. కానీ ఈ మధ్య సల్మాన్ చేసిన ఓ కామెంట్ ఇండస్ట్రీని షాక్‌కు గురిచేసింది. మూడు దశాబ్దాలుగా బాలీవుడ్‌ను ఏలుతున్న ఈ నటుడు, తన సినిమాల స్క్రిప్ట్‌ల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

26
కథ చదవడం ఇష్టం ఉండదు..

వెరైటీ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ఈ విషయం చెప్పారు. 'నా జీవితంలో నేను ఎప్పుడూ సినిమా స్క్రిప్ట్ చదవలేదు' అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. 'నేను కథలు రాస్తాను, కానీ వాటిని ఎప్పుడూ చదవను' అని కూడా స్పష్టం చేశారు. 

సాధారణంగా నటీనటులు సినిమా ఒప్పుకునే ముందు పదుల సార్లు స్క్రిప్ట్ చదువుతారు. కానీ సల్మాన్ మాత్రం సినిమా చేసే ముందు కథలోని 'ఫీల్' ఎలా ఉంది, అది ప్రేక్షకులకు ఎలా కనెక్ట్ అవుతుంది అనే దానిపైనే దృష్టి పెడతారట. దర్శకుడు కథ చెప్పినప్పుడు వచ్చే కిక్ చాలు అనేది భాయ్ సిద్ధాంతం!

36
షాకింగ్ లాజిక్ చెప్పిన కండల వీరుడు..
ఇదే ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ ధరించే ఖరీదైన వాచ్‌ల గురించి కూడా చర్చ జరిగింది. సల్మాన్ చేతికి కనిపించే వాచ్‌ల ధర కొన్నిసార్లు కోటి రూపాయలకు పైనే ఉంటుంది. దీని గురించి అడిగినప్పుడు భాయ్‌జాన్ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. 'నా చేతికి వాచ్ కనిపిస్తే అది నాదే అని కాదు. కొన్నిసార్లు అది నా స్నేహితులది కావచ్చు, మరికొన్నిసార్లు వేరే వాళ్లది కావచ్చు' అని నవ్వేశారు. ఆయన లాజిక్ విని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
46
ల్నల్ పాత్రలో సల్మాన్ ఖాన్..
ఇక సల్మాన్ ఖాన్ సినిమాల విషయానికొస్తే, ఆయన ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్' బ్యానర్‌పై వస్తున్న 'మాతృభూమి' చిత్రంలో ఆయన భారత సైన్యంలో కల్నల్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో చిత్రాంగదా సింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
56
తెలుగు డైరెక్టర్ తో సినిమా..

ఇక అన్నింటికన్నా పెద్ద వార్త ఏంటంటే, 2027 ఈద్‌ను సల్మాన్ ఇప్పటినుంచే బుక్ చేసుకున్నారు. సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతారతో సల్మాన్ మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. తాత్కాలికంగా 'SVC63' అని పేరు పెట్టిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ దర్శకుడు  వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయనున్నారు.

66
రాజా శివాజీ' చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్
ఇటీవల విడుదలైన రితేష్ దేశ్‌ముఖ్ 'రాజా శివాజీ' చిత్రంలో సల్మాన్ జీవా మహాల పాత్రలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. మొత్తానికి, స్క్రిప్ట్ చదవకపోయినా బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టే సల్మాన్ ఖాన్ 'బిందాస్' యాటిట్యూడే ఆయన సక్సెస్ సీక్రెట్ కావచ్చు!
Read more Photos on
click me!

Recommended Stories