Actress Bhanupriya: సీనియర్ నటి భానుప్రియ తన కెరీర్‌లో ఇష్టం లేకుండా చేసిన సినిమా నాట్యం అని వెల్లడించారు. పాత్ర ప్రాముఖ్యత లేకపోవడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నానని తెలిపారు. చెన్నైలో స్థిరపడటం..
సీనియర్ నటి భానుప్రియ తన కెరీర్‌లో చేసిన కొన్ని చిత్రాల గురించి, ముఖ్యంగా నాట్యం సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. నాట్యం సినిమాలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని, దర్శకులు చెప్పిన విధంగా లేకపోవడంతో నిరాశ చెందానని తెలిపారు. ఈ సినిమాలోని తన పాత్ర నచ్చక అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అసంతృప్తిని చెప్పారని పేర్కొంది.
25
మొదట కథ చెప్పినప్పుడు..
మొదట కథ చెప్పినప్పుడు తన పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందని, కూతురిని ప్రోత్సహించే తల్లి పాత్ర అని చెప్పారని, అయితే షూటింగ్ పూర్తయ్యేసరికి అది కేవలం ప్రాధాన్యం లేని పాత్రగా మిగిలిపోయిందని భానుప్రియ వివరించారు. ఈ అనుభవం తర్వాత, ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
35
హైదరాబాద్‌కు తరలిపోయినా తాను చెన్నైలోనే..
అలాగే, తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కు తరలిపోయినా తాను చెన్నైలోనే ఎందుకు ఉండిపోయారన్న ప్రశ్నకు ఆమె ఇలా చెప్పింది. అప్పట్లో హైదరాబాద్‌కు మారాలనే ఆలోచన రాలేదని, చెన్నైలోనే స్థిరపడిపోయానని చెప్పారు. మంచి కథాంశాలు ఉన్న చిత్రాలు వస్తే తప్పకుండా నటిస్తానని ఆమె స్పష్టం చేశారు.
తాను ఇంకా నటిస్తున్నానని, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ వంటి పలు భాషల్లోనూ నటించానని గుర్తు చేశారు. 1984లో సితార చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన భానుప్రియ.. ఆ తర్వాత పదేళ్ళపాటు ఎంతో బిజీగా ఉన్నానని, తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేయడం మొదలుపెట్టానని అన్నారు. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా మంచి ప్రొడక్షన్, మంచి కథలు ఉన్న చిత్రాలనే ఎంచుకొని చేశానని, కమర్షియల్ చిత్రాల్లో కూడా నటించానని వివరించారు. పెద్ద హీరోల పక్కన అవకాశాలు వచ్చి వదులుకున్నవి ఏమీ లేవని ఆమె తెలిపారు.
55
చిరంజీవితో డాన్స్
అటు చిరంజీవి తనతో పాటు రాధ డాన్స్ చేయడం ఒక ఛాలెంజ్ అని చెప్పేవారని, ఆయన మంచి డాన్సర్ కాబట్టి ఆయనతో కలిసి డాన్స్ చేయడం తనకు ఎంతో ఇష్టమని భానుప్రియ చెప్పారు.