Ananya Nagalla: అనన్య నాగళ్ళ తన సినీ కెరీర్, వకీల్ సాబ్ అనుభవాలు, ఇండస్ట్రీలోని అవకాశాలపై ఇటీవల ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చినా, తెలుగు అమ్మాయిగా దీర్ఘకాలిక కెరీర్‌ను ఆశిస్తున్నానన్నారు.
నటి అనన్య నాగళ్ళ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లను వివరించింది. ఖమ్మం అమ్మాయిగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్న అనన్య.. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా చెప్పుకొచ్చింది.
25
ఖమ్మం నుంచి వచ్చినా..
ఖమ్మం నుంచి వచ్చినా, తనది విజయవాడ సమీపంలోని సత్తుపల్లి ప్రాంతమని, అందుకే తెలంగాణ స్లాంగ్ ఎక్కువగా కనిపించదని ఆమె వివరించింది. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు వస్తాయనే అభిప్రాయం మొదట్లో ఉన్నప్పటికీ, తెలుగు అమ్మాయిలకు కెరీర్‌లో దీర్ఘకాలిక మనుగడ ఉంటుందని ఆమె పేర్కొంది.
35
ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నామని..
గత ఐదు, ఆరు సంవత్సరాలుగా తెలుగు నటీమణులుగా తామందరం ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నామని, రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే ఉంటామని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, అర్థవంతమైన, పాత్ర ప్రాధాన్యమున్న రోల్స్ చేసే అవకాశాలు తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా వస్తాయని అనన్య అభిప్రాయపడింది.
వకీల్ సాబ్ చిత్రంలో నటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేసినప్పటికీ, స్టార్ రేంజ్ హీరోలతో సినిమాలు రాలేదని మొదట్లో కొంచెం నిరాశ చెందానని తెలిపింది. అయితే, ఆ తర్వాత వచ్చిన పాత్రలు చాలా మంచివని, తంత్ర లాంటి చిత్రాలలో నటించడం తనకు నచ్చిందని తెలిపింది.
55
క్యారెక్టర్ ఓరియెంటెడ్ టూ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్
నటిగా తనకు "క్యారెక్టర్ ఓరియెంటెడ్", "పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్" రోల్స్ చేయడమే లక్ష్యమని తెలిపింది. మల్లేశం, ప్లేబ్యాక్, వకీల్ సాబ్ లాంటి చిత్రాలలో ఎక్కువగా సాంప్రదాయ, క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు చేయడంతో, తాను అలానే ఉంటానని చాలామంది భావించారని చెప్పింది. అయితే, శాకుంతలం షూటింగ్ సమయంలో గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడం ప్రారంభించానని, ఆ తర్వాత చేసిన పలు సినిమాల్లో కూడా గ్లామరస్ రోల్స్ చేశానని పేర్కొంది.