సమంత రెండో పెళ్లిపై వేణు స్వామి అదిరిపోయే రియాక్షన్‌.. వీళ్లకి దిమ్మతిరిగే కౌంటర్‌

Published : Dec 02, 2025, 08:43 PM IST

సమంత రాజ్‌ నిడిమోరుతో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పెళ్లిపై వేణు స్వామి స్పందించారు. అయితే ఆయన రియాక్షన్‌ మాత్రం క్రేజీ అని చెప్పొచ్చు. 

PREV
14
రాజ్‌ నిడిమోరుతో సమంత రెండో పెళ్లి

స్టార్‌ హీరోయిన్‌ సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సోమవారం ఆమె దర్శకుడు రాజ్‌ నిడిమోరుని మ్యారేజ్‌ చేసుకుంది. తమిళనాడులోని కోయంబత్తూర్‌లోగల ఇషా ఫౌండేషన్‌లో వీరి వివాహం జరిగింది. అత్యంత పురాతన సాంప్రదాయమైన `భూతశుద్ధి వివాహ` పద్ధతిలో వీరిద్దరు ఒక్కటయ్యారు. ప్రస్తుతం సమంత, రాజ్‌ నిడిమోరు పెళ్లి వార్త అత్యంత చర్చనీయాంశంగా మారుతోంది. టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. చాలా మంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా తమపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు సమంత, రాజ్‌ నిడిమోరు. తాజాగా దీనిపై వేణు స్వామి స్పందించారు.

24
సమంత పెళ్లిపై వేణు స్వామి రియాక్షన్

సమంత రెండో పెళ్లిపై ప్రముఖ సెలబ్రిటీ ఆస్ట్రోలజిస్ట్ వేణు స్వామి స్పందించారు. ఆయన్ని చాలా మంది అడుగుతున్నారట. సమంత రెండో పెళ్లి గురించి చెప్పండని వరుసగా ఫోన్స్ చేస్తున్నారని, మెసేజ్‌లు పెడుతున్నారని, సమంత పెళ్లిపై జాతకం చెప్పాలని, ఆమె భవిష్యత్‌ ఎలా ఉండబోతుందనేది చెప్పాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. సమంత మౌఢ్యంలో పెళ్ళి చేసుకున్నారు, భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుంది, అదేంటనేది అడుగుతున్నారని, వీరిద్దరు కలిసే ఉంటారా? విడిపోతారా? అని అడుగుతున్నారని తెలిపారు వేణు స్వామి. ఈ క్రమంలో ఆయన ఓ వీడియోని విడుదల చేశారు.

34
అప్పుడే ట్రోల్ చేశారు, నేను చెప్పను

అయితే సమంత పెళ్లికి సంబంధించిన తాను స్పందించనని వెల్లడించారు వేణు స్వామి. `16 నెలల క్రితం నాగచైతన్య, శోభిత పెళ్లిపై మాట్లాడితే చాలా విమర్శలు చేశారు, ట్రోల్స్ చేశారు. చైతన్య, శోభిత అడిగితే జాతకం చెప్పావా అని నిలదీశారు. మరి ఇప్పుడు మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా మొత్తం సమంత పెళ్లికి సంబంధించి ఆస్ట్రోలజిస్ట్ ల చుట్టూ తిరుగుతున్నారు, సమంత పెళ్లిపై స్పందించాలని అడుగుతున్నారు. వాళ్లకి మగ పిల్లవాడు పుడతాడా? ఆడపిల్ల పుడుతుందా అని మీడియా వాళ్లు ఆస్ట్రోలజిస్ట్ ల నోళ్లల్లో మైక్లు పెడుతున్నారు, మరి మీరు దీనిపై స్పందించరా అని అడుగుతున్నారు. ఉదయం నుంచి ఫోన్స్, మెసేజెస్‌ వస్తున్నాయి. ఇప్పుడు సమంత, రాజ్‌ నిడిమోరు అడిగారా తమ జాతకం చెప్పమని, మరి వీళ్లెందుకు వెళ్లి ఆస్ట్రోలజిస్ట్ ల నోళ్లల్లో మైకులు పెడుతున్నారని అంటున్నారు. దీనిపై స్పందించాలంటున్నారు. కానీ నేను మూడు రోజులుగా ఇప్పుడు రిలీజ్‌ కాబోతున్న పెద్ద సినిమాకి సంబంధించి పెద్ద హిట్‌ కావాలని, నిర్మాతలు, దర్శకుల తరఫున పూజా కార్యక్రమాలు చేస్తున్నాను. నాకు ఎలాంటి పట్టింపులు లేవు` అని తెలిపారు వేణు స్వామి.

44
వాళ్లకి వేణుస్వామి దిమ్మతిరిగే కౌంటర్‌

ఇంకా స్పందిస్తూ, `వాళ్లు(పలువురు మీడియా వాళ్లని ఉద్దేశించి) ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఒకలాగా, వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తే మరోలా చూస్తున్నారు. ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా, లేపాలంటే మరోలాగా చూపించుకుంటారు. వాళ్ల గురించి నాకు అవసరం లేదు. నా పనులు నేను చేసుకుంటూ వెళ్లిపోతున్నాను. ఆ తిరుమల వెంకటేశ్వరస్వామి, కామాఖ్యా అమ్మవారి, భగాలమ్మ అమ్మవారు, చిన్నమస్తా అమ్మవారు ఉన్నారు. నన్ను ఏవిధంగా సేవ్‌ చేసుకోవాలనేది అమ్మవార్లకే వదిలేసి, నా ప్రయాణాన్ని నేను కొనసాగిస్తున్నాను` అని తెలిపారు వేణు స్వామి. ఈ సందర్భంగా సమంత రెండో పెళ్లిపై ఆయన స్పందించబోనని తెలిపారు. అదే సమయంలో గతంలో తనని వివాదాల్లోకి లాగిన కొన్ని మీడియా సంస్థలను టార్గెట్‌ చేస్తూ ఆయన దిమ్మతిరిగే కౌంటర్లు ఇచ్చారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories