శివతత్వం, అఘోరలు, హిందుత్వం, సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటి చెప్పే ఉద్దేశ్యంతో ఈ సినిమాని రూపొందించారు. ఇది పూర్తిగా హిందూ ధర్మాన్ని ఫోకస్ చేసేదిగా ఉండబోతుందని ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు తెలిపాయి. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా, ఆయన మూడు గెటప్స్ లో కనిపించడం విశేషం. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. హర్షాలి, పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా చేస్తోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఏ సర్టిఫికేట్‌ని పొందింది.