బిగ్‌ బాస్‌ తెలుగు 9 లేటెస్ట్ ఓటింగ్‌.. టాప్‌లో దూసుకెళ్తున్న తనూజ.. డేంజర్‌లో ఉన్నదెవరంటే?

Published : Dec 02, 2025, 05:24 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 9.. 13 వారం మొదటి రోజు ఓటింగ్‌ లెక్కలు చూస్తే ఆశ్చర్యకరమైన రిజల్ట్ కనిపిస్తుంది. ఈ వారం ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్‌లో ఉండబోతున్నారు. 

PREV
14
రసవత్తరంగా మారుతున్న `బిగ్‌ బాస్‌ తెలుగు 9` షో

బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ షో రాను రాను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా మారుతుంది. వారాలు దగ్గర పడుతున్న కొద్ది ఆట రసవత్తరంగా మారుతుంది. స్నేహాలు, బాండింగ్‌లు అన్నీ పటాపంచల్‌ అవుతున్నాయి. స్నేహంగా ఉన్నవాళ్లే గొడవలు పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నామినేషన్‌ ఎపిసోడ్‌లో తనూజ, ఇమ్మాన్యుయెల్‌ ల మధ్య గట్టి వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. మరోవైపు డీమాన్‌ పవన్‌ కూడా తాను సొంతంగానే గేమ్‌ ఆడతానని సవాల్‌ విసిరాడు.

24
13వ వారం నామినేషన్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు

ఇదిలా ఉంటే 13వ వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు.  తనూజ, భరణి, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి, సంజనా ఈ వారం నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇమ్మాన్యుయెల్‌, కళ్యాణ్‌ ఈ వారం సేఫ్‌లో ఉన్నారు. ఇక నామినేషన్‌లో ఉన్న వారికి పడుతున్న ఓటింగ్‌ శాతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రోజు రోజు ఓటింగ్‌ ఎంత వస్తుందనేది క్యూరియాసిటీని క్రియేట్‌ చేస్తోంది. ప్రారంభం నుంచి ఎన్ని ఓట్లు పడతాయనేది చాలా ముఖ్యం. దీన్ని బట్టే ఈ వారం టాప్‌లో ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది తెలుస్తుంది.

34
టాప్‌లో దూసుకుపోతున్న తనూజ

ఈ లెక్కన సోమవారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్‌ కాగా, ఇప్పుడు ఒక్క రోజులో నమోదైన ఓట్ల లెక్క చూస్తే ఈ వారం ఇప్పటి వరకు తనూజ అత్యధిక ఓటింగ్‌ శాతంతో టాప్‌లో దూసుకుపోతుంది. ఆమె ఎప్పుడు నామినేషన్‌లో ఉన్నా టాప్‌లోనే ఉంటుంది. మిగిలిన అందరు కంటెస్టెంట్లతో పోల్చితే ఆమెకి ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. టీవీ సెలబ్రిటీ కావడం, సెలబ్రిటీ ఫాలోయింగ్‌ ఉండటంతోపాటు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది. దీనికితోడు పీఆర్‌ని కూడా మెయింటేన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఆమె అత్యధికంగా 30శాతం ఓటింగ్‌ తో టాలో దూసుకుపోతుంది.

44
చివర్లో ముగ్గురు కంటెస్టెంట్లు

ఆ తర్వాత రీతూ చౌదరీ ఉంది. తనూజతో పోల్చితే సగం ఓటింగ్‌ శాతమే ఉన్నా, రెండో స్థానంలో కొనసాగడం విశేషం. ఇక టాప్‌ 3లో సంజనా ఉన్నారు. ఆమె గతంలో లీస్ట్ లో ఉండగా, ఇప్పుడు దూసుకుపోతుంది. ఆ తర్వాత భరణి ఉన్నారు. ఆయన నాల్గో స్థానానికి పరిమితమయ్యారు. ఇక లీస్ట్ లో డీమాన్‌ పవన్‌, సుమన్‌ శెట్టి. వీరిలో సుమన్‌ శెట్టికి అతి తక్కువ ఓట్లు పడి చివర్లో ఉన్నారు. అయితే భరణికి, పవన్‌కి, సుమన్‌ శెట్టికి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇదే కొనసాగితే ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ డేనే కావడంతో ఇప్పుడే ఏం చెప్పలేం, ఈ రోజు, రేపటి ఓటింగ్‌తో ఓ క్లారిటీ రాబోతుంది. అయితే ఈ వారంగానీ, వచ్చే వారంగానీ డబుల్‌ ఎలిమినేషన్‌కి కూడా ఛాన్స్ ఉందంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories