విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ ఈ సంక్రాంతికి వచ్చింది. మంగళవారం(జనవరి 14న) విడుదలైంది. ఈ మూవీకి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. అప్పటికే పాటలు హిట్ అయ్యాయి. ప్రమోషన్స్ పరంగానూ యాక్టివ్‌గా ఉన్నారు. థియేటర్‌లో అదే జోరు కనిపించింది. ఫన్ బాగా వర్కౌట్ అయ్యింది. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీల మధ్య కామెడీ విపరీతంగా ఆడియెన్స్ కి ఎక్కింది. అలాగే బుల్ రాజు, కేశవ పాత్రలు సైతం బాగా ఆకట్టుకున్నాయి.

వెంకటేష్‌కి ఇటీవల కాలంలో సరైన హిట్ పడలేదు. `ఎఫ్ 2` తర్వాత ఆయన చేసిన ఏ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఈ క్రమంలో ఇప్పుడు `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ వెంకీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. విక్టరీ ఈజ్ బ్యాక్ అని అనిపించుకుంటున్నారు. ఈ లెక్కన ఈ మూవీ ఈజీగా వంద కోట్ల జాబితాలో చేరబోతుంది. రెండు వందల కోట్ల వరకు వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఆదివారం వరకు పండగ సీజన్ నడుస్తుంది. ఇంకా నాలుగు రోజులు ఈ మూవీ పంట పండుతుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడం ఈ మూవీకి పెద్ద అడ్వాంటేజ్.