క్రితం సంవత్సరం ప్రభాస్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'కల్కి 2898'. ఈ సినిమాతో రూ.1000 కోట్ల మార్క్ దాటేశాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో ఫుల్ బిజీ. దీని తర్వాత సలార్ 2, కల్కి 2 రెడీగా ఉన్నాయి. ఓవైపు 'సలార్' షూటింగ్ గురించి సెట్స్ సిద్ధమవుతుండగా..
మరోవైపు 'కల్కి' పార్ట్ 2 గురించి కొన్ని వార్తలు మొదలయ్యాయి. ఈ సినిమా గురించి రకరకాల గాసిప్స్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో కీలకమైన విషయాలను నిర్మాత అశ్వనీదత్ మీడియాకు చెప్పుకొచ్చారు.
'కల్కి' పార్ట్ 1 లో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. చివర్లో మహాభారతం ఎపిసోడ్, అందులో కర్ణుడు-అర్జునుడు సీన్స్ సూపర్ హైలైట్ అయ్యాయి. వీటిని చూసి చాలామంది మరికాసేపు ఇవి ఉంటే బాగుండు అని ఆశపడ్డారు. ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరిందని అశ్వనీదత్ చెప్పుకొచ్చారు. అ లాగే రిలీజ్ గురించి మాట్లాడారు.
అశ్వనీదత్ మాట్లాడుతూ...‘‘కల్కి 2’ వచ్చే ఏడాది విడుదలవుతుంది. ’’ అని తేల్చి చెప్పారు. ఇది విన్న అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ 2025 లో కల్కి 2 రిలీజ్ అవుతుందనుకుంటే ఇంకో సంవత్సరం వాయిదానా అంటున్నారు. అయితే అంత భారీ సినిమా అదీ గ్రాఫిక్స్ తో కూడుకున్నది తీయాలంటే ఆ మాత్రం టైమ్ పడుతుందనేది నిజం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). గతేడాది విడుదలైన ఈ చిత్రం భారతీయ సినిమాకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది.
అశ్వనీదత్ కంటిన్యూ చేస్తూ... రెండో పార్ట్ మొత్తం కమల్‌హాసనే ఉంటారు. ప్రభాస్ (Prabhas), కమల్ హాసన్‌ల మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఆ సినిమాకు మెయిన్. వీళ్లతో పాటు దీపికా పదుకొణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
కొత్త వాళ్లు ఉంటారని నేను అనుకోవడం లేదు. ఒకవేళ కథకు అవసరమైతే రెండో పార్ట్‌లో కొత్త వాళ్లు ఉండే అవకాశం ఉంది’’ అని అన్నారు. అంటే....సెకండ్ పార్ట్ మొత్తం కర్ణుడు, అశ్వద్ధామ హీరోలు కాగా.. విలన్‌గా సుప్రీం యాష్కిన్ కనిపిస్తాడట.
కల్కి లో ఉన‍్న కొద్దిపాటి నిమిషాలకే మహా భారతం సీన్లతో నాగ్ అశ్విన్ తన మార్క్ చూపించాడు. మరి ఇప్పుడు రెండో పార్ట్ ఇంకేం మ్యాజిక్ చేస్తాడోనని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. త్వరలో ప్రభాస్ డేట్స్ ని బట్టి షూటింగ్ మొదలవ్వొచ్చని తెలుస్తోంది.
ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అగ్ర నటులు అమితాబ్ బచ్చన్.. అశ్వత్థామగా, కమల్ హాసన్.. సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలతో అలరించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెంచేశారు.
read more: 'జైలర్' లో బాలకృష్ణగారికి ఏ పాత్ర అనుకున్నానంటే.. : నెల్సన్
also read: దేవర బతికే ఉన్నాడా? ప్రకాష్ రాజే యతినా? `దేవర 2` అసలు స్టోరీ?