సినిమా జీవితమే ఓ మాయా ప్రపంచం. అందులో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. చాలామంది ఫ్యామిలీస్ తో చాలా హ్యాపీగా ఉంటారు. కాని కొంత మంది మాత్రం తమ జీవితంలో ఆటుపోట్లు చూస్తూనే ఉంటారు. మరికొంత మంది డబ్బుపలుకుపడితో పాటు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటుంటారు. అలాంటి హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం.
Also Read: నయనతార అహంకారం.. తన సిబ్బందిని ఇబ్బంది పెట్టిన లేడీ సూపర్ స్టార్
vanitha vijayakumar
అతి పెద్ద సినిమా కుటుంబం నుంచి వచ్చిన ఈ నటి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా రాణించింది. కాని ఆతరువాత ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీతో పాటు తన ఫ్యామిలీలో కూడా విభేదాలు తెచ్చిపెట్టాయి. ఆమెను వ్యతిరేకించేలా చేశాయి. దాంతో ఎవరు సపోర్ట్ చేయకపోవడంతో ఒంటరి జీవితం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు వనిత విజయ్ కుమార్.
Also Read: శంకర్ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అతనేనా..? ఆయన మార్క్ మ్యూజిక్ ఎటు వెళ్ళిపోయింది..?
vanitha vijayakumar
సౌత్ ఇండియన్ సీనియర్ నటుడు విజయ్ కుమార్.. దివంగత సీనియర్ నటి మంజుల దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన వనిత విజయ్ కుమార్.ఆతరువాత తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. నటిగా కొనసాగుతున్న టైమ్ లోనే కుటుంబంతో ఆమెకు వివాదాలు వచ్చాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా కాంట్రవర్సియల్ స్టార్ గా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: 50 సెకండ్ల యాడ్ కోసం 5 కోట్లు తీసుకున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?
Vanitha Vijayakumar
హీరోయిన్ గా కొనసాగుతున్న టైమ్ లోనే ..కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. ముందుగా నటుడు ఆకాష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆకాష్ తో విడాకులు తీసుకుంది వనితా. వీరి విడాకులు టైమ్ లోనే ఫ్యామిలీ గోడవలు ఆస్తులు గోడవలు ఎక్కువయ్యాయి.
వనితను ఇంటి నుంచి బయటు పంపించారు. వనిత తనయుడు విజయ్ శ్రీహరి కూడా ఆమెతో ఉండటానికి ఇష్టపడకపోవడంతో.. అతను తాత విజయ్ కుమార్ దగ్గరేపెరిగాడు. జోవిక మాత్రం వనిత దగ్గర పెరిగింది. ఇక రెండోసారి బిజినెస్ మెన్ ఆనంద్ జే రాజన్ ను పెళ్ళాడింది వనిత.
వీరికి జయనిత అనే కూమార్తె కలిగింది. వీరిమధ్య కూడా మనస్పర్ధలు రావడంతో.. విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి విజయ్ కుమార్ ఫ్యామిలీ చేరదీయకపోవడంతో.. ఒంటరిగానే ఇద్దరు ఆడపిల్లలతో ఓంటరి జీవితం గడుపుతోంది.
Also Read:
ఇక రీసెంట్ ఇయర్స్ లో వనిత విజయ్ కుమార్ పీటర్ పాల్ అనే వ్యక్తిని పెళ్ళాడింది. పెళ్ళైన వారం రోజులకే అతన్ని ఇంటి నుంచి తరిమేసిందట వనిత, ఆతరువాత అతను అనారోగ్యంతో మరణించాడు. ఇక ఇప్పుడు ఒంటరిగానే ఉంటోంది వనితా విజయ్ కుమార్. ప్రస్తుతం యూట్యూబర్ గా కొనసాగుతూ.. కోలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది. రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి.. రెండు సార్లు వివాదాస్పదం అయ్యింది.
రెండో సారి ఆమెపై దాడి కూడాజరిగింది. తెలుగులో దేవి సినిమాతో పాపులర్ అయిన వనితా విజయ్ కుమార్.. ఈమధ్య కాలంలో నరేష్ నటించిన మళ్లీ పెళ్ళి సినిమాలో నటించి మెప్పించింది. వనిత ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది అన్నట్టుగా తయారయ్యింది ఆమె పరిస్థితి.