వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఆగిపోయిన మూవీ ఏంటో తెలుసా? ఒక్కసారి కాదు ఏకంగా మూడు సార్లు

Published : Oct 26, 2025, 06:11 PM IST

వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో ఇప్పటి వరకు ఒక్క మూవీ కూడా రాలేదు. కానీ ఓ సినిమాని అధికారికంగా ప్రకటించారు. కానీ ఆగిపోయింది. ఇలా ఒక్కసారి కాదు, ఏకంగా మూడుసార్లు జరిగింది.  

PREV
16
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌ లో మిస్‌ అయిన మూవీస్‌

విక్టరీ వెంకటేష్‌ తన కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు. ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు కూడా. శ్రీదేవి నుంచి అందరు స్టార్‌ హీరోయిన్లతో రొమాన్స్ చేశారు. ఇప్పటి తరం హీరోయిన్లతోనూ యాక్ట్ చేస్తున్నారు. ఫామ్ లో ఉన్న హీరోయిన్లందరితోనూ రొమాన్స్ చేశారు. కానీ ఒక్క స్టార్‌ హీరోయిన్‌తో మాత్రం సినిమా చేయలేకపోయారు. ఒకప్పుడు టాలీవుడ్‌ని షేక్‌ చేసిన హీరోయిన్‌ ఇలియానాతో వెంకీకి సినిమా పడలేదు. అయితే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ రావాల్సి ఉంది. కానీ ఆగిపోయింది. ఒక్కసారి కాదు, ఏకంగా మూడు సార్లు జరిగింది. 

26
చాలా ఏళ్ల తర్వాత సోలోగా `సంక్రాంతికి వస్తున్నాం`తో బ్లాక్‌ బస్టర్‌

వెంకటేష్‌ ఈ ఏడాది కెరీర్‌ బెస్ట్ హిట్‌ అందుకున్నారు. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.  పాన్‌ ఇండియా మూవీస్‌ని పక్కన పెడితే సింగిల్‌ లాంగ్వేజ్‌లో విడుదలైన చిత్రాల్లో హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఇది సుమారు మూడు వందల కోట్లకుపైగా వసూళ్లని రాబట్టడం విశేషం. అయితే వెంకటేష్‌కి సోలోగా హిట్‌ పడి చాలా ఏళ్లు అవుతుంది. `తులసి` లాస్ట్ హిట్‌ అని చెప్పాలి.

36
వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో మూవీ

ఆ తర్వాత `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` మూవీతో హిట్‌ అందుకున్నారు. ఇందులో మహేష్‌ బాబు మరో హీరో. ఆ తర్వాత `ఎఫ్‌ 2`తో హిట్‌ కొట్టాడు. ఇందులో వరుణ్‌ తేజ్‌ మరో హీరో. ఇలా మల్టీస్టారర్‌తో తప్ప సోలో హీరోగా సక్సెస్‌ రాలేదు. `తులసి` తర్వాత బ్యాక్ టూ బ్యాక్‌ ఫ్లాప్స్ పడ్డాయి. ఆ సమయంలోనే ఓ క్రేజీ మూవీని ప్రకటించి ఆపేశారు. అలా ఆగిపోయిన మూవీనే `గంగ`. ఇందులో ఇలియానా హీరోయిన్‌, అమ్మా రాజశేఖర్‌ దర్శకుడు. 2010లో ఈ సినిమాని ప్రకటించారు. `గంగ` పేరుతో వెంకీ, ఇలియానా జంటగా ఈ మూవీని రూపొందించాలనుకున్నారు. అధికారికంగా ప్రకటించారు.

46
వెంకీ మూవీతో మూవీ ఆగిపోవడానికి కారణమిదే

బహుశా సురేష్‌ ప్రొడక్షన్‌లోనే ఈ మూవీని అనుకున్నట్టు సమాచారం. యాక్షన్‌ ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కించాలని భావించారు. కానీ ప్రకటనకే పరిమితమయ్యింది. ఆ తర్వాత ఆగిపోయింది. అయితే `తులసి` తర్వాత వెంకీకి `చింతకాయల రవి` పెద్దగా ఆడలేదు. `ఈనాడు` డిజాస్టర్‌ అయ్యింది. `నమో వెంకటేశాయ` యావరేజ్‌గానే ఆడింది. `నాగవళ్లీ` డిజాస్టర్‌, `బాడీ గార్డ్` డిజాస్టర్. ఆ సమయంలోనే `గంగ` మూవీని అనుకున్నారు. వరుసగా వెంకీకి యాక్షన్‌ మూవీస్‌ బాక్సాఫీసు వద్ద వర్కౌట్ కావడం లేదు. దీంతో ఇలియానాతో కలిసి చేయాల్సిన `గంగ`ని ఆపేశారని సమాచారం. అలా వెంకీ, ఇలియానా కాంబినేషన్‌ మిస్‌ అయ్యింది.

56
మూడు సార్లు మిస్‌

ఒక్కసారి కాదు, ఏకంగా మూడు సార్లు మిస్‌ అయ్యింది. ఆ తర్వాత వెంకటేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా అనుకున్నారు. డీవీవీ దానయ్య ఆ మూవీని నిర్మించాలని ప్లాన్‌ చేశారు. ఇలియానాని హీరోయిన్‌గా ఫైనల్‌ చేశారు. ఇది ప్రకటనకే పరిమితమయ్యింది. ఆ తర్వాత ఆగిపోయింది. అనంతరం వెంకటేష్‌ హీరోగా దశరథ్‌ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ మూవీని చేయాలని భావించారు. ఆల్మోస్ట్ ఇది కూడా ఓకే అయ్యింది. ఇందులోనూ హీరోయిన్‌గా ఇలియానా పేరే వినిపించింది. కానీ ఆదిలోనే ఆగిపోయింది. ఇలా మూడు సార్లు వెంకటేష్‌, ఇలియానా కాంబినేషన్‌లో మూవీస్‌ మిస్‌ కావడం గమనార్హం.

66
సినిమాలకు దూరమైన ఇలియానా

ఇలియానా `దేవదాసు` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేష్‌బాబు, పవన్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రవితేజ, రామ్‌, నితిన్‌, రానా, మంచు విష్ణు వంటి వారితో రొమాన్స్ చేసింది. వరుసగా బ్లాక్ బస్టర్స్ అందుకుంది. వీరిలో ఎక్కువగా రవితేజతో చేయడం విశేషం. ఆయన ఒక్కడితోనే ఏకంగా నాలుగు సినిమాల్లో నటించింది. `ఖతర్నాక్`, `కిక్`, `దేవుడు చేసిన మనుషులు`, `అమర్ అక్బర ఆంటోనీ` వీరి కాంబోలో వచ్చాయి. చివరగా ఆమె తెలుగులో `అమర్‌ అక్బర్‌ ఆంటోనీ` మూవీలో మెరిసింది. ఇది ఆడలేదు. దీంతో టాలీవుడ్ కి దూరమయ్యింది. ఇలియానా ప్రస్తుతం సినిమాలకే దూరమయ్యింది.  రెండేళ్ల క్రితం మైఖేల్‌ డోలన్‌ని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు జన్మించారు. ప్రస్తుతం వారిని చూసుకోవడంలో బిజీగా ఉంది ఇలియానా.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories