తెలుగు, తమిళ చిత్రాలలో నటించి, ఐటెం సాంగ్స్ చేసి ఫేమస్ అయిన ముమైత్ ఖాన్, నలుగురితో డేటింగ్ చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. నలుగురితో బ్రేకప్ అయిందట. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉంటున్నానని ముమైత్ ఖాన్ తెలిపింది.
నటి ముమైత్ ఖాన్ ఒక గ్లామర్ నటిగా పేరు పొందింది. ఆమె పూర్తి పేరు ముమైత్ అబ్దుల్ రషీద్ ఖాన్ అయినా, సినిమా కోసం తన పేరును కుదించుకుంది. ముంబైకి చెందిన ఈమె, నటిగానే కాకుండా మోడల్, డ్యాన్సర్‌గా కూడా ప్రసిద్ధి చెందింది.
24
హీరోయిన్‌గా నటించిన ముమైత్ ఖాన్:
ఇటీవల 40 ఏళ్లు పూర్తి చేసుకున్న ముమైత్ ఖాన్, ఎక్కువగా తెలుగు, హిందీ చిత్రాలలో ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా ఫేమస్ అయ్యింది. మహేష్ బాబు పోకిరి చిత్రంలో ముమైత్ ఖాన్ చేసిన ఐటెం సాంగ్ యువతని ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత యోగి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేసింది. కొన్ని చిత్రాల్లో కీలక పాత్రల్లో కూడా నటించింది.
34
బిగ్ బాస్ తెలుగు:
సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత బిగ్ బాస్ తెలుగు షోలో పాల్గొంది. ఆమె బాగా ఆడినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది. ఈ మధ్య కాలంలో ఏ సినిమాల్లో నటించకుండా సోషల్ మీడియాలో ఫోటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ యాక్టివ్‌గా ఉంటోంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, తాను నలుగురితో డేటింగ్ చేసినట్లు చెప్పి షాక్ ఇచ్చింది. దీని గురించి ఆమె ఇంకా మాట్లాడుతూ, 'నాకు ఇటీవల ఒక ప్రమాదం జరిగింది. దాని నుంచి కోలుకుని పూర్తి విశ్రాంతి తీసుకుంటున్నాను. ఈ ప్రమాదానికి ముందు నలుగురితో డేటింగ్ చేశాను.నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను డేటింగ్ చేసిన వారెవరితోనూ టచ్‌లో లేను. ఒంటరిగా హాయిగా జీవిస్తున్నాను. నాకు నచ్చిన వ్యక్తి కనిపిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తాను' అని చెప్పింది. బ్రేకప్ జరిగింది కదా అని ఇక అబ్బాయిలే నా లైఫ్ లో వద్దు అని చెప్పను. నచ్చిన వ్యక్తి దొరికితే మళ్ళీ ప్రేమలో పడతానేమో అని ముమైత్ ఖాన్ తెలిపింది. ముమైత్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.