విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ హిట్టా ఫ్లాపా ? అసలు నిజం బయటపెట్టిన నాగ వంశీ

Published : Oct 26, 2025, 05:13 PM IST

విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం పూర్తి స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ రిజల్ట్ పై సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతోంది. నిర్మాత నాగవంశీ అసలు కింగ్డమ్ మూవీ హిట్టా ఫ్లాపా అనే విషయంలో తాజాగా క్లారిటీ ఇచ్చారు. 

PREV
15
విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ

విజయ్ దేవరకొండ నటించిన చివరి చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా రూపొందింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ విలక్షణమైన నటనతో అదరగొట్టారు. ఈ మూవీలో భాగ్య శ్రీ బోర్సే కీలక పాత్రలో నటించింది. రిలీజ్ కి ముందు కింగ్డమ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మూవీ రిలీజయ్యాక ఆ అంచనాలని పూర్తిగా అందుకోలేదు.

25
అసలు కింగ్డమ్ హిట్టా ఫ్లాపా ?

ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ విషయంలో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. కలెక్షన్ల విషయంలో కూడా ఈ చిత్రం నిరాశ పరిచినట్లు వార్తలు వచ్చాయి. ట్రేడ్ పండితులు కింగ్డమ్ చిత్రాన్ని ఫ్లాప్ గా డిసైడ్ చేశారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో నిర్మాత నాగవంశీ అసలు కింగ్డమ్ మూవీ రిజల్ట్ ఏంటి ? హిట్టా ఫ్లాపా ? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.

35
నిర్మాత నాగవంశీ కామెంట్స్

ఇంటర్వ్యూలో మీడియా ప్రతినిధులు కింగ్డమ్ మూవీ ఫ్లాప్ అని ప్రస్తావించగా నాగవంశీ ఖండించారు. కింగ్డమ్ మూవీ ఫ్లాప్ కాదు. యుఎస్ లో కింగ్డమ్ చిత్రం 1.8 మిలియన్ డాలర్స్ వసూలు చేసింది. ఆ సినిమాని ఫ్లాప్ అని ఎలా అంటారు ? నైజాంలో 11 కోట్ల వరకు రాబట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రాలకంటే చాలా బెటర్ గా వసూళ్లు వచ్చాయి.

45
కింగ్డమ్ మూవీ రిజల్ట్ ఇదే

జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన సినిమా, విజయ్ దేవరకొండ క్రేజ్, అనిరుద్ సంగీతం, ట్రైలర్ తో విపరీతంగా అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని మూవీ రీచ్ కాలేదు. కానీ ఫెయిల్యూర్ అని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. కింగ్డమ్ మూవీ మేము అమ్మిన రేట్లకు దాదాపు అన్ని ఏరియాల్లో 70 నుంచి 90 శాతం వరకు రికవరీ సాధించింది. బహుశా బయ్యర్లకు 10 శాతం లాస్ వచ్చి ఉండొచ్చు. మా లెక్కల ప్రకారం కింగ్డమ్ మూవీ అబౌ యావరేజ్. ఫ్లాప్ అయితే కాదు అని నాగవంశీ అన్నారు.

55
నాగవంశీకి ఎదురు దెబ్బలు

కింగ్డమ్ తర్వాత నాగవంశీకి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ల వార్ 2 చిత్రాన్ని నాగవంశీ భారీ రేటుకి దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల హక్కులని 90 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ వార్ 2 మూవీ డిజాస్టర్ కావడంతో నాగ వంశీకి 40 నుంచి 50 కోట్ల వరకు లాస్ వచ్చిందనే టాక్ వినిపించింది.

Read more Photos on
click me!

Recommended Stories