NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో

Published : Jun 25, 2026, 08:05 AM IST

స్వర్గీయ నందమూరి తారక రామారావు సాధించిన ఓ రికార్డుని బద్దలు కొట్టడం మాస్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ ఎవరి వల్లా కాలేదు. కానీ ఒకే ఒక్క హీరో క్లాస్ మూవీతో ఆ ఘనత సాధించారు. 

PREV
15
టాలీవుడ్ మాస్ హీరోలు

టాలీవుడ్ లో సినిమాల విషయంలో రికార్డ్స్ గురించి మాట్లాడితే ఎక్కువగా ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, చిరంజీవి, బాలయ్య లాంటి మాస్ హీరోల సినిమాల పేర్లే వినిపిస్తాయి. కానీ విక్టరీ వెంకటేష్ సైలెంట్ సునామీ సృష్టించే హీరో. వెంకటేష్ సినిమాలో మాస్ అంశాలు ఎక్కువగా ఉండవు. భారీ డైలాగులు, క్రేజీ డ్యాన్స్ మూమెంట్స్ అసలే ఉండవు. అయినప్పటికీ మాస్ హీరోలతో సమానంగా వెంకటేష్ కి రికార్డులు ఉన్నాయి.

25
36 ఏళ్ళ తర్వాత ఎన్టీఆర్ రికార్డు బద్దలు

చిరంజీవికి కూడా సాధ్యంకాని ఒక అరుదైన రికార్డ్ ని వెంకటేష్ అందుకున్నారు. అంతకు ముందు ఆ రికార్డ్ సర్గీయ ఎన్టీఆర్ పేరుపై ఉండేది. 36 ఏళ్ళ తర్వాత వెంకటేష్ ఎన్టీఆర్ రికార్డ్ ని బద్దలు కొట్టి చరిత్ర సృష్టించారు. ఆ రికార్డ్ ఏంటంటే.. విడుదలైన అన్ని సెంటర్స్ లో 100 రోజులు ప్రదర్శించబడిన మూవీగా వెంకటేష్ నటించిన సినిమా నిలిచింది.

35
క్లాస్ మూవీతో వెంకీ విధ్వంసం

1963లో ఎన్టీఆర్ నటించిన ఆల్ టైం క్లాసిక్ లవకుశ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్ లో 100 రోజులు ఆడింది. ఈ రికార్డుని బద్దలు కొట్టడం కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ లాంటి మాస్ హీరోల వల్ల కాలేదు. కానీ వెంకటేష్ తన సినిమాతో రికార్డ్ బ్రేక్ చేశారు. అది కూడా మాస్ సినిమానో, పౌరాణిక చిత్రమో, ఫాంటసీ కథ కాదు.. సింపుల్ లవ్ అండ్ ఫ్యామిలీ చిత్రం. ఆ మూవీ మరేదో కాదు కలిసుందాం రా. వెంకటేష్, సిమ్రాన్ జంటగా నటించిన ఈ చిత్రం ఉదయ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కింది.

45
కలెక్షన్ల వర్షం

ఒకే మూవీలో సంక్రాంతి పండక్కి వెంకటేష్ లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్, కామెడీ లాంటి అంశాలని అందించారు. ఎస్ ఏ రాజకుమార్ అందించిన సంగీతం అదిరిపోయింది. ముఖ్యంగా పసిఫిక్ లో దూకేయ్ మంటే అనే సాంగ్ యువతని ఉర్రూతలూగించింది. ఫలితంగా కలిసుందరా ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది. టాలీవుడ్ లో తొలిసారి 30 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన మూవీ ఇదే.

55
వెంకటేష్ వరుస విజయాలు

అంతకు ముందు వెంకటేష్ ప్రేమించుకుందాం రా, పెళ్లి చేసుకుందాం, సూర్యవంశం, గణేష్, ప్రేమంటే ఇదేరా, రాజా ఇలా డబుల్ హ్యాట్రిక్ సూపర్ హిట్స్ తో జోష్ లో ఉన్నారు. ఆ తర్వాత విడుదలైన శీను మూవీ డిజాస్టర్. దీనితో ఈసారి బౌన్స్ బ్యాక్ కావాలి అని కలిసుందాం రా కథని వెంకీ ఎంచుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories