రామ్ చరణ్ హీరోగా నటించిన `పెద్ది` మూవీ మొదటి రెండు వారాలు దుమ్ములేపింది. కానీ ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది. హిట్ కి ఇంకా చాలా దూరంలో ఉండిపోయింది. సమంత దెబ్బ గట్టిగానే ఉంది.
రామ్ చరణ్ `గేమ్ ఛేంజర్` వంటి డిజాస్టర్ తర్వాత `పెద్ది`తో ఆడియెన్స్ ని అలరించేందుకు వచ్చారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జూన్ 4న విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీకి మొదటి రోజు నుంచే మిశ్రమ స్పందన లభించింది. యాక్షన్, ఎలివేషన్ల డోస్ తగ్గడంతో ఆడియెన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం దుమ్ములేపింది. మొదటి వారం అదిరిపోయే వసూళ్లని రాబట్టింది. రెండో వారం కూడా స్టడీగా కలెక్షన్లు కొనసాగాయి. మూడో వారం నుంచి క్రమంగా తగ్గాయి. ఇప్పుడు నాల్గో వారంలో పూర్తిగా డల్ అయిపోయింది.
25
పెద్ది మూవీ 21 రోజుల కలెక్షన్లు
ఇక పెద్ది సినిమా విడుదలై 21 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఎంత వసూలు చేసిందనేది చూస్తే, ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ.333కోట్లు వచ్చాయి(సాక్నిల్క్ లెక్కల ప్రకారం). అంటే సుమారు రూ.190కోట్లకుపైగా షేర్ సాధించింది. ఇండియాలో దీనికి రూ.280కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తే, రూ.236.60కోట్ల నెట్ ని రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.53కోట్లు వచ్చాయి. అక్కడ మాత్రం ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అక్కడ 40శాతం నష్టాలను మిగిల్చిందని సమాచారం.
35
పెద్ది మూవీ ఏరియా వైజ్ కలెక్షన్లు
`పెద్ది` సినిమాకి ఏరియా వైజ్ చూస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.213.70కోట్లు, తమిళనాడులో రూ.6.43కోట్లు, కర్నాటకలో రూ.30కోట్లు, కేరళాలో రూ.72 లక్షలు, హిందీలో రూ.29.40కోట్లు రాబట్టింది. నార్త్‌లోనూ ఈ మూవీకి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఊహించినదానికంటే సగం కూడా రాలేదని సమాచారం. అక్కడ వంద కోట్లకుపైగా ఆశించారు. కనీసం యాభై కోట్లకు కూడా చేరలేదు. అలాగే కర్నాటకలోనూ ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ నాలుగు వందల కోట్లకుపైగా రాబట్టిందని టీమ్ వెల్లడించిన విషయం తెలిసిందే.
ఓవరాల్‌గా `పెద్ది` సినిమాకి రూ.220కోట్ల బిజినెస్ అయ్యింది. ఇప్పుడు రూ.190 కోట్లకుపైగా షేర్ వచ్చిందని సమాచారం. ఈ వారంలో సినిమాకి కలెక్షన్లు తగ్గాయి. సోమవారం నుంచి రోజుకి కనీసం కోటి కూడా రావడం లేదు. సోమవారం(19వ రోజు) రూ.95లక్షలు, మంగళవారం(20వ రోజు) రూ.91లక్ష, బుధవారం(21వ రోజు) రూ.80లక్షలు మాత్రమే వస్తున్నాయి. ఈ లెక్కన `పెద్ది` బాక్సాఫీసు వద్ద ముగింపు దశకు చేరుకుంది. అయితే సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నా, అది కలెక్షన్లలో ప్రభావం చూపించడం లేదు. ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా రూ.25-30కోట్ల షేర్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కష్టమే అని ట్రేడ్ వర్గాల సమాచారం.
55
పెద్ది సినిమాకి సమంత గట్టి దెబ్బ
`పెద్ది` సినిమా జోరుకి ఇప్పుడు సమంత బ్రేకులు వేసింది. ఆమె నటించిన `మా ఇంటి బంగారం` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో వీకెండ్‌లోనే కాదు, వీక్ డేస్‌లోనూ సత్తా చాటుతోంది. రోజుకి దీనికి మూడు నాలుగు కోట్లకుపైగా కలెక్షన్లు వస్తున్నాయట. ఇది స్ట్రాంగ్‌గా రన్ అవుతుంది. దీని కారణంగా `పెద్ది`కి వసూళ్లు తగ్గాయి. సమంత `మా ఇంటి బంగారం` ఇప్పుడు సుమారు అరవై కోట్లకు దగ్గరలో ఉంది. మొత్తంగా సమంత కారణంగా రామ్ చరణ్ సినిమాకి గట్టి దెబ్బ తగలబోతుంది.