Venkatesh, Aishwarya Rai Missed a Blockbuster: టాలీవుడ్ లో 90స్ స్టార్ హీరోలలో విక్టరీవెంకటేష్ ది ప్రత్యేక స్థానం. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయనకు పాపులారిటీ ఎక్కువ. రీమేక్ సినిమాల రారాజు కూడా. టాలీవుడ్ లో ఎక్కువ సక్సెస్ రేటు ఉన్న హీరో కావడంతో.. విక్టరీ ఆయన ఇంటిపేరుగా మారింది. 65 ఏళ్లు దాటినా.. ఇంకా అదే ఫిట్ నెస్ తో, అదే జోష్ తో సినిమాలు చేస్తూ.. హిట్ కొడుతున్నారు వెంకీ. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు వెంకటేష్. అదే జోష్ తో మరికొన్నిసినిమాలు లైన్ లో పెట్టారు.
Also Read: సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అసలు నిజం ఇదే?
ఇక వెంకటేష్ కెరీర్లో ఆయన సరసన ఎంతో మంది హీరోయిన్లు నటించి మెప్పించారు. సౌత్ భామలు మాత్రమే కాదు..బాలీవుడ్ బ్యూటీస్ కూడా వెంకటేష్ తో ఆడి పాడారు. వెంకీతో రొమాన్స్ చేశాక స్టార్ హీకరోయిన్లు గా మారిన వారు కూడా ఉన్నారు. వెంకటేష్ తో సూపర్ హిట్ సినిమాలు చేశారు. వారిలో అంజలా జావేరి, ప్రీతి జింట, కత్రీనా కైఫ్ లాంటి వారు ఉన్నారు. కత్రీనా కైఫ్ కు అయితే ఫస్ట్ సినిమా హీరో వెంకీనే. మల్లీశ్వరి సినిమాలో వీరి కాంబోచేసిన అల్లరి అంతా ఇంతా కాదు.
Also Read: విజయ్ దేవరకొండ నుంచి రణ్‌బీర్ వరకు: స్పోర్ట్స్ బయోపిక్‌లకు పర్ఫెక్ట్ హీరో ఎవరో తెలుసా?
ఇక ఈ క్రమంలోనే వెంకటేష్ తో ఐశ్వర్యారాయ్ కాంబినేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. అంత మంది బాలీవుడ్ భామలతో సందడి చేసిన వెంకటేష్... ఐశ్వర్యారాయ్ తో కూడా ఓ సినిమా చేయబోయి మిస్ అయ్యాడట. వెంకటేష్ ఐశ్వర్యారాయ్ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోయి మిస్ అయ్యిందని తెలుస్తోంది. అది కూడా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ వీరిద్దరు చేయాల్సి ఉందట. ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?
Also Read: 40 కోట్లు బడ్జెట్ పెడితే 40 వేలు కూడా రాలేదు, దేశంలోనే చెత్త రికార్డ్ ఈ సినిమాదే?
ఆమూవీ ఏదో కాదు ప్రేమించుకుందాం రా. వెంకటేష్ కెరీర్ లో యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సినిమా. అప్పట్లో యువత ఈ సినిమా చూసి ఉర్రూతలూగారు, ప్రేమికులయితే చెప్పనక్కర్లేదు. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో ఒక సంచలనం. అంతే కాదు ఈసినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ అంజలా జవేరి హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.
Also Read: స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?
అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ చేయాల్సి ఉంది. ఈమూవీలో ముందుగా ఐశ్వర్యరాయ్ ని అనుకున్నారట. దర్శకుడు జయంత్ సి పరాన్జీ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమాకు సబందించిన అనుభవాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ముందుగా నేను ఐశ్వర్య రాయి(Aishwarya Rai) ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాను. అప్పుడే ఆ అమ్మాయి ఇండస్ట్రీ లోకి వచ్చింది అన్నారు.
నా బంధువుల ద్వారా ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు, ఈ సినిమాకు ఐశ్వర్య రాయి అయితే చాలా బాగుంటుంది అని మూవీ టీం తో చెప్పాను. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. అప్పుడు వరుసగా ఐశ్వర్య రాయి ప్లాప్ సినిమాలు చేసింది. వరుసగా డిజాస్టర్స్ ని ఫేస్ చేయడంతో.. ఆమెను తీసుకోవాలి అంటే భయపడ్డారు. ఆమెను తీసుకుంటే సినిమా ప్లాప్ అవుతుంది అని టీమ్ వద్దన్నారు. దాంతో అంజలా జావేరిని తీసుకున్నామని ఆయన అన్నారు. ఇలా ఐశ్వర్యా రాయ్ , వెంకటేష్ కాంబోలో సినిమా మిస్ అయ్యిందట.