సౌందర్యకి `అమ్మోరు` సినిమా ఛాన్స్ రావడానికి కారణమైన స్టార్‌ కమెడియన్‌ ఎవరో తెలుసా? 70 స్కూల్లో వెతికితే

Published : Apr 01, 2025, 05:15 PM IST

సౌందర్య కెరీర్‌లో బిగ్గెస్ట్ లైఫ్‌ టర్నింగ్‌ మూవీ `అమ్మోరు`. ఆ సినిమాతో ఆమె లైఫే మారిపోయింది. ఇందులో ఆఫర్‌ రావడానికి ఓ స్టార్‌ కమెడియన్‌ కారణమని టాక్‌.   

PREV
16
సౌందర్యకి `అమ్మోరు` సినిమా ఛాన్స్ రావడానికి కారణమైన స్టార్‌ కమెడియన్‌ ఎవరో తెలుసా? 70 స్కూల్లో వెతికితే
Soundarya

తెలుగు తెరకు నిండుతనం తీసుకొచ్చిన నటి సౌందర్య. స్టార్‌ హీరోగా టాలీవుడ్‌ని శాషించిన సౌందర్యకి తెలుగులో కెరీర్‌ని మార్చేసిన మూవీ `అమ్మోరు`. ఈ సినిమా ఆఫర్‌ సౌందర్యకి రావడానికి కారణం ఎవరు తెలుసా? ఓ స్టార్‌ కమెడియన్ కారణం కావడం విశేషం. మరి అది ఎలా జరిగింది? ఆస్టార్‌ కమెడియన్‌ ఎవరు ? అనేది చూస్తే. 

26
Soundarya

సౌందర్య పదో తరగతి పూర్తి కాగానే సినిమాల్లోకి వచ్చింది. తండ్రి ఒత్తిడి మేరకు ఆమె నటిగా మారింది. అయితే ఆమె తెలుగులోకి `మనవరాలి పెళ్లి` సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రాజేంద్రప్రసాద్‌తో `రాజేంద్రుడు గజేంద్రుడు` సినిమా చేసింది. ఆ సమయంలోనే `మాయలోడు` మూవీలో ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో కూడా రాజేంద్రప్రసాద్‌ హీరో. ఇందులో బాబుమోహన్‌ కమెడియన్‌గా నటించారు.

36
babu mohan

అంతేకాదు ఇందులో `చినుకు చినుకు అందెలతో` అనే పాటలో బాబు మోహన్‌, సౌందర్య కలిసి నటించారు. దుమ్మురేపారు.ఈ పాట కోసం ఈ మూవీ ఏడాదికిపైగా ఆడిందంటే అతిశయోక్తి కాదు. రాజేంద్రప్రసాద్‌ కంటే ఇందులో బాబుమోహనే హీరో అని అంతా పిలుచుకోవడం, బాబుమోహన్‌కి విపరీతమైన క్రేజ్‌ రావడం విశేషం. 

46
babu mohan

ఈ సినిమా షూటింగ్‌ టైమ్‌లోనే సౌందర్యని చూసి ఇంప్రెస్‌ అయ్యాడు బాబు మోహన్‌. ఆ సమయంలోనే `అమ్మోరు` సినిమా కోసం అమ్మాయిని వెతుకుతున్నారట. చాలా మంది పిల్లల్ని చూసినా దర్శక నిర్మాతలకు నిరాశనే ఎదురైంది. దాదాపు 70 స్కూల్స్ లో అమ్మాయిలను చూశారట, ఎవరు క్యూట్‌గా ఉంటే వారిని తీసుకుందామని, ఈ విషయం తెలిసి బాబుమోహన్‌ తన `మాయలోడు` సినిమా షూటింగ్‌లోనే బాబుమోహన్‌.. ఇలా సౌందర్య ఉందని నిర్మాతలకు చెప్పారు. ఫోటోలు తీసి నిర్మాతలు శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి, ఆర్‌బీ చౌదరీలకు పంపించారు. 

56

బాబు మోహన్‌ రికమండేషన్‌తోనే సౌందర్యని చూసిన కోడి రామకృష్ణ.. `అమ్మోరు` సినిమాకి ఎంపిక చేశారు. ఈ మూవీకి సెలక్ట్ అయిన వెంటనే మేకర్స్ అంతా క్యూ కట్టారు. సౌందర్య కావాలని ఆమె కోసం ఎగబడ్డారు. `అమ్మోరు` సినిమా షూటింగ్‌ డిలే అయ్యింది. ఫాంటసీ ఎలిమెంట్లతో కూడిన మూవీ కావడంతో కాస్త టైమ్‌ పట్టింది.  

66
Soundarya

ఈ లోపు సౌందర్య తెలుగులో వచ్చిన వరుసగా ఆఫర్లని ఓకే చేసింది. సినిమాలుచేసింది. 25 సినిమాలు చేసింది సౌందర్య. అవి రిలీజ్‌ కూడా అయ్యాయి. అయితే వీటిలో చాలా వరకు చిన్న పాత్రలు ఉన్నాయి. సగం హీరోయిన్‌గా చేసిన మూవీస్‌ ఉన్నాయి. చిన్న చిత్రాలు, పెద్ద మూవీస్‌ అనే తేడా లేకుండా చేసింది. రెండేళ్లలోనే ఆమె టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. దీనికి ఓ రకంగా బాబు మోహన్‌ కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  

read  more: మా సినిమాలు చూడకండి, రివ్యూస్‌ రాయకండి.. నిర్మాత నాగవంశీ ఫైర్‌, టార్గెట్ `భారతీయుడు`?

also read: చెప్పు తెగుద్ది.. రమ్మంటూ సైగ చేసిన జబర్దస్త్ కమెడియన్‌కి యాంకర్‌ రష్మి మాస్‌ వార్నింగ్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories