అప్పుడు వేద, విన్నికి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. నువ్వేమీ కంగారు పడకు అక్కడ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ నాకు తెలుసు నేను ఫోన్ చేస్తాను నువ్వు బయల్దేరు నేనూ వస్తాను అంటాడు విన్ని. మరోవైపు మధ్య రాత్రిలో మెలకువ వచ్చిన యష్ కి వేద కనిపించకపోవడంతో ఆమెని వెతుకుతూ బయటికి వస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన వేద, విన్ని మాట్లాడుకోవడం చూసిన యష్ అపార్థం చేసుకుంటాడు. మీ ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్లు ఉన్నారు డిస్టర్బ్ చేసినందుకు సారీ అంటాడు. నా భార్య కోసం నేను పిచ్చోడి లాగా వెతుకుతున్నాను కానీ తనకి పాత స్నేహాలు కూడా ఉన్నాయని మర్చిపోయాను,ఆ పాత బంధాలు ఇప్పుడు మొగుడు పెళ్ళాల బంధానికి అడ్డుగా మారుతున్నాయి అంటాడు. ఇంతలోనే తలకి కట్లు కట్టుకొని వచ్చిన వసంత్ ని చూసి ఏమైంది అని అడుగుతాడు.