చిరకాల కోరికను బయట పెట్టిన నయనతార.. ఆ క్రేజీ ప్రాజెక్ట్ పై లేడీ సూపర్ స్టార్ గురి?

First Published | Apr 14, 2023, 11:05 AM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) లాంగ్ విష్ ను తాజాగా బయటపెట్టారు. ఓ వేదికపై అవార్డు అందుకుంటున్న సందర్భంగా తన మనసులోని మాటను వెల్లడించింది. 
 

సౌత్ లో తిరుగులేని హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ గా బిరుదు అందుకున్న నయనతార (Nayanthara) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాలతో, ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్నారు. 
 

అయితే, నటిగా ఎంతఎదిగినా ఏదోచేయాల్సి ఉందని హీరోహీరోయిన్లు చెబుతూనే ఉంటారు. వారి చిరకాల కోరికలను ఆయా సందర్భాల్లో బయటపెడుతూనే ఉంటారు. ఈ రీసెంట్ గా స్టార్ హీరోయిన్ నయనతార కూడా తన మనస్సులోని మాటను బయటపెట్టింది.
 


కోలీవుడ్ లో జరిగిన ఓ అవార్డు వేదికలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) చేతుల మీదుగా నయనతార అవార్డును అందుకున్నారు. ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంది. ఈ సందర్భంగా తన చిరకాల కోరికను వెల్లడించింది.

నయన్ మాట్లాడుతూ.. మణిరత్నం చేతుల మీదుగా అవార్డును అందుకోవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. అందరూ నటీనటుల లాగే నాకు ఆయన దర్శకత్వంలో నటించాలని ఉంది. ఒక చిత్రంలో నటించాలంటూ.. చెప్పుకొచ్చింది. గతంలో అవకాశం వచ్చిన కొన్ని కారణాలతో కుదరలేదన్నారు.  
 

ప్రస్తుతం నయనతారే స్వయంగా అడగడంతో మణిరత్నం అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చూడాలి. రాబోయే రోజుల్లో మణిరత్నం - కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఇప్పటికే సినిమాను ప్రకటించారు. ఈక్రమంలో లోకనాయకుడి సరసన నయన్ కు నటించే ఛాన్స్ వరిస్తుందా చూడాలి.  
 

గతంలో మణిరత్నం దర్శకత్వంలో నటించే చాన్స్ వచ్చిన ఆయా కారణాలతో సెట్ కాలేకపోయింది. మరోవైపు కమల్ హాసన్ సరసన కూడా నయన్ నటించలేదు. ఈసారి అన్నీ కుదిరితే KH234తో నయన్ కోరిక తీరనుందని అంటున్నారు. దీంతో ఈ కాంబినేషన్ పై మరింత ఆసక్తి నెలకొంది. 
 

Latest Videos

click me!