ఏం మాట్లాడుతున్నావ్ అని ఆశ్చర్యంగా అడుగుతాడు విన్ని. నీకు తెలియకపోవడమేంటి? ఆఫీస్ మొత్తం వసంత్ కి అప్పజెప్పి పర్మినెంట్గా వెళ్ళిపోతున్నాడంట కదా, దానికి కారణం మాత్రం నువ్వే, వేదని కెలికావు అందుకే రెండో పెళ్ళాన్ని కూడా వదిలేసి పోతున్నాడు వాడి జాతకమే అంత. అప్పట్లో నేను మాళవికని కెలికాను, ఇప్పుడు నువ్వు. వాడు పోతే పోయాడు నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోన్ పెట్టేస్తాడు అభి.