ఎన్టీఆర్ బ్యూటీ జాన్వీ కపూర్ బోల్డ్ ట్రీట్... గ్రీన్ కట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన శ్రీదేవి కూతురు!

Published : Apr 27, 2023, 11:19 AM IST

ముంబైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లుక్ అందరినీ ఆకర్షించింది. ట్రెండీ డిజైనర్ వేర్లో సరికొత్తగా మెరిశారు.   

PREV
111
ఎన్టీఆర్ బ్యూటీ జాన్వీ కపూర్ బోల్డ్ ట్రీట్... గ్రీన్ కట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన శ్రీదేవి కూతురు!
Janhvi Kapoor

హీరోయిన్ జాన్వీ కపూర్ ఫ్యాషన్ ఐకాన్ గా అవతరిస్తున్నారు. ఈ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ అవార్డు ఈవెంట్లో ప్రత్యేకంగా నిలిచారు. ఆమె ట్రెండీ అవుట్ ఫిట్ జాన్వీ అందాలు రెట్టింపు చేసింది. జాన్వీ కపూర్ లేటెస్ట్ లుక్ వైరల్ అవుతుంది. 
 

211
Janhvi Kapoor

జాన్వీ పేరు సౌత్ లో కూడా మారుమ్రోగుతుంది. కారణం ఆమె ఎన్టీఆర్ 30 హీరోయిన్ గా ఎంపిక కావడమే. జాన్వీ కపూర్ ని సౌత్ కి పరిచయం చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇది సాకారం చేసి చూపారు. ఎన్టీఆర్ 30లో జాన్వీ కపూర్ నటిస్తుంది. ఆమె షూటింగ్స్ సెట్స్ కూడా జాయిన్ అయినట్లు సమాచారం. 
 

311
Janhvi Kapoor


శ్రీదేవి కూతురిగా గా ఒక్క సినిమా చేయకుండానే ఆమెకు సౌత్ లో ఫేమ్ దక్కింది. ఇక ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్, జాన్వీ మదర్ శ్రీదేవి జంటగా పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతం చేశారు. వారి వారసులైన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ మొదటిసారి జతకడుతున్నారు. 

411
Janhvi Kapoor


ఎన్టీఆర్ 30 వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే నిరవధికంగా చిత్రీకరణ పూర్తి చేయనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ పార్ట్ పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. 
 

511
Janhvi Kapoor

ఎన్టీఆర్ 30 కోసం జాన్వీ కపూర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఒక్క కమర్షియల్ హిట్ లేని జాన్వీ కోట్లు తీసుకోవడమంటే విశేషమే. కాగా ఈ చిత్రంలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ రేంజ్ హిట్ బాలీవుడ్ లో నమోదు చేయాలని చూస్తున్న చూస్తున్న ఎన్టీఆర్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లను ఎంచుకున్నారు.

611
Janhvi Kapoor

ఇక జాన్వీ కెరీర్ పరిశీలిస్తే... ఆమె ప్రయోగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమె లేటెస్ట్ మూవీ మిల్లీ సైతం ప్రయోగాత్మకంగా తెలిసింది. మిల్లీ నవంబర్ 4న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇది సర్వైవల్ థ్రిల్లర్ జోనర్ కాగా ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం లేనిది. 

711
Janhvi Kapoor


ప్రస్తుతం జాన్వీ మిస్టర్ అండ్ మిస్ మహితో పాటు వరుణ్ ధావన్ కి జంటగా బవాల్ మూవీ చేస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ జరుపుకుంటాయి. గత ఏడాది ఆమె మిల్లీ టైటిల్ తో ప్రయోగాత్మక చిత్రం చేశారు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన మిల్లీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. 

811
Janhvi Kapoor


పరిశ్రమకు వచ్చి చాలా కాలం అవుతున్నా హీరోయిన్ గా జాన్వీకి బ్రేక్ రాలేదు. ఆమె అడపాదడపా చిత్రాలు చేస్తున్నప్పటికీ భారీ హిట్ ఆమె ఖాతాలో పడలేదు. స్టార్స్ పక్కన జాన్వీకి ఇంకా అవకాశాలు రావడం లేదు.
 

911
Janhvi Kapoor


2018లో విడుదలైన ధడక్ మూవీతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీదేవి మరణించే నాటికి ధడక్ చిత్రీకరణ దశలో ఉంది. కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న కల నెరవేరకుండానే ఆమె ప్రమాదవశాత్తు మరణించారు.
 

1011
Janhvi Kapoor

దఢక్ అనంతరం... బయోపిక్ గుంజన్ సక్సేనా, రూహి చిత్రాల్లో నటించారు. ఆమెకు నటిగా మార్కులు పడినప్పటికీ కమర్షియల్ ఈ చిత్రాలు ఆడలేదు. గుడ్ లక్ జెర్రీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు.

1111
Janhvi Kapoor

ముంబైలో జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ లుక్ అందరినీ ఆకర్షించింది. ట్రెండీ డిజైనర్ వేర్లో సరికొత్తగా మెరిశారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories