ఎపిసోడ్ ప్రారంభంలో కారులో వెళ్తున్న యష్ మనసుకి ఏదో దిగులుగా ఉంది, గుండెల్లో ఏదో అవుతుంది అనుకుంటాడు. మరోవైపు వేద కారులో వస్తూ ఎంత సంతోషంగా గడిపారు, నాతో డిన్నర్ కి కూడా వచ్చారు కదా అంతలోనే డైవర్స్ పేపర్ ఇచ్చారు. ఇంత సీక్రెట్ గా ఎలా మెంటైన్ చేశారు అనుకుంటూ ఏడుస్తుంది. మరోవైపు ఎంత వద్దనుకుంటున్నా వేద ఆలోచనలే వస్తున్నాయి. ఆమె జ్ఞాపకాలు నన్ను బాధ పెడుతున్నాయి ఇంత పెయిన్ ఏంటి నాకు అనుకుంటాడు. కృషి ఇచ్చిన పెయింటింగ్ చూసుకుంటూ వసంత్.. మంచి మాట అన్నావు వేద వదిన నీకు ఉపకారం చేసింది అన్నావు తనకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అన్నావు ఇదేరా తనకి నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనుకుంటాడు.