ఎవరికీ చెప్పుకోలేనిది, ఎవరికీ చూపించుకోలేనిది అంటూ బాధగా చెప్తుంది ధరణి. ఈ లోపు శైలేంద్ర రావడం గమనించి నాప్కిన్ పట్టుకొని వెళ్తుంది ధరణి. చేయి కడుక్కుంటూ నువ్వు ఏది వండితే అది తినాలా, నాక్కూడా ఇష్టాలు ఉంటాయి నీ ఇష్టాలు నా మీద రుద్దకు అంటూ ఆ నాప్కిన్ ధరణి మొహానికి కొడతాడు శైలేంద్ర. అప్పుడే చేయి కడుక్కోడానికి వచ్చిన ధరణి ఏమంటున్నాడు శైలేంద్ర, నీ వంటని మెచ్చుకుంటున్నాడా అంటుంది. మాట దాటవేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధరణి. ఏంటో నా ఇష్టం అంటూ మేడం తో చాలా సీరియస్ గా మాట్లాడుతున్నారు అని జగతికి చెప్తుంది వసు. ఆ మాటలు విన్న దేవయాని లాక్కొని వెళ్లి నా కొడుకు మీదే చాడీలు చెప్తున్నావా, అనవసరంగా నా కొడుకు కోడలు మధ్య జోక్యం చేసుకోకు.