Samantha Birthday: బర్త్ డే వేళ సమంత సంచలన పోస్ట్, ఇకపై అంతా... అంటూ!

Published : Apr 28, 2023, 10:13 AM IST

సమంత బర్త్ డే నేడు. ఈ సందర్భంగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె మానసిక స్థితి తెలియజేస్తుంది.   

PREV
16
Samantha Birthday: బర్త్ డే వేళ సమంత సంచలన పోస్ట్, ఇకపై అంతా... అంటూ!
Samantha


స్టార్ లేడీ సమంత బర్త్ డే నేడు. 1987 ఏప్రిల్ 28న జన్మించిన 36వ ఏట అడుగుపెట్టారు. సమంతకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. చిత్ర ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అత్యంత సన్నిహితుల బర్త్ డే విషెస్ సమంత తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు. 
 

26
Samantha

కాగా బర్త్ డే రోజు ఆమె సోషల్ మీడియా పోస్ట్స్ లో ఒకటి నెటిజెన్స్ ని ఆకర్షించింది. సెల్ఫీ దిగిన సమంత అది పోస్ట్ చేసి... 'ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఇయర్' అని కామెంట్ పెట్టారు. ఈ ఏడాది అంతా శుభమే అని  సమంత విశ్వాసం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

36
Image: Samantha Ruth Prabhu / Instagram

సమంత గత రెండేళ్లుగా వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2021 ఆమెకు కలిసి రాలేదు. నాగ చైతన్యతో విడాకులు అయ్యాయి. అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. మానసిక ఒత్తిడికి గురయ్యారు. ఆ వేదన నుండి కోలుకున్న వెంటనే మయోసైటిస్ రూపంలో మరో సమస్య ఆమెను చుట్టుముట్టింది. గత రెండు సంవత్సరాల అనుభాలు దృష్టిలో పెట్టుకొని సమంత... ఈ ఏడాది మాత్రం మంచే జరుగుతుందని కామెంట్ చేశారనిపిస్తుంది.  
 

46
Image: Samantha Ruth Prabhu / Instagram

సమంత మయోసైటిస్ నుండి పూర్తిగా కోలుకున్నారని ఫ్యాన్స్ బావిస్తున్నారు. అయితే సమంత సడన్ గా ఆక్సిజన్ మాస్క్ తో కనిపించడం షాక్ ఇచ్చింది. సమంత సోషల్ మీడియా పోస్ట్ భయపెట్టింది ఆమెకు ఏమైందనే సందేహాలు వ్యక్తం చేశారు. ఆమె నెక్స్ట్ ఫోటో చూశాక క్లారిటీ వచ్చింది. సమంత ఆ మాస్క్ పెట్టుకుంది హైపర్బేరిక్ థెరపీ కోసం అట. దీని ప్రయోజనాలు ఏమిటో ఆమె పోస్ట్ చేశారు. 
 

56
Image: Samantha Ruth Prabhu / Instagram


హైపర్బేరిక్ థెరఫీ కండరాల వాపు, ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. పాడైన కండరాలను బాగుచేస్తుందని సమంత వెల్లడించారు. మయోసైటిస్ సోకిన నేపథ్యంలో సమంత హైపర్బేరిక్ థెరఫీ తీసుకుంటున్నారని అర్థం అవుతుంది. విషయం తెలిశాక సమంత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా ఆమె కొన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నారన్న వాదన వినిపిస్తుంది. 
 

66
Image: Samantha Ruth Prabhu / Instagram

ఇక సమంత కెరీర్ పరిశీలిస్తే... ఆమె లేటెస్ట్ మూవీ శాకుంతలం ప్లాప్ అయ్యింది. ప్రస్తుతం సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకుడు కాగా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.  
 

click me!

Recommended Stories