Guppedantha Manasu: జగతి, మహీంద్రల కొత్త ప్లాన్.. రిషికి షాకిచ్చిన వసుధార?

First Published Sep 30, 2022, 9:59 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...గౌతమ్, జగతి,మహేంద్రలు గదిలో కూర్చొని ఏ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి అని మాట్లాడుకుంటారు. అప్పుడు జగతి, మిషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని పనులు మిగిలిపోయాయి అని అంటుంది. అయితే అదే సరైనది ఈ వంకతో మనం రిషి ని, వసులని కాలేజీలో కలపొచ్చు అని అనుకుంటారు. బయట నుంచి దేవయాని చూసి వీళ్ళు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు అబ్బా అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో, రిషి మంచం మీద కూర్చొని వసుధార గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు.
 

 ఇంతలో మహేంద్ర కాఫీ తెస్తాడు మీరు తెచ్చారు ఎందుకు డాడ్ అని అనగా, పిల్లలు తినగలిగినా సరే అమ్మ గోరుముద్దలు ఎందుకు పెడుతుందో తెలుసా రిషి, తన చేత్తో తినిపిస్తే పిల్లలను చూసి తన కడుపు నిండుతుంది అని. పురాణాల్లోని ఎప్పుడూ తల్లి ప్రేమ గురించి రాస్తారు కానీ తండ్రి ప్రేమ గురించి రాయరు కదా అని అనగా మీరేనా బెస్ట్ ఫ్రెండ్ డాడ్ అని రిషి అంటాడు. అప్పుడు మహేంద్ర,చెప్పడం మర్చిపోయాను కాలేజీలోనే మిషన్ ఎడ్యుకేషన్ గురించి కొన్ని మీటింగ్లు ఉండిపోయాయి అంట జగతి గుర్తు చేసింది.
 

 నీకు చెయ్యి నొప్పి ఉంటే ఉండిపో మేము వెళ్లి చూసుకుంటాము అని అనగా, సెలవులప్పుడు ఈ పని చేయడం మంచిదే డాడ్, నాకేం నొప్పి లేదు నేను వస్తాను అని అంటాడు రిషి. ఆ తర్వాత సీన్లో రిషి కాలేజ్ కి వెళ్తాడు. కాలేజీలో తన గదిలోకి వెళ్లిన తర్వాత తన గదిలో ఉన్న హాట్ సింబల్ ని చూసి వసుధార, నాకు మోయలేనన్ని జ్ఞాపకాలను ఇచ్చావు కానీ ఒక్క ఆలోచన మనిద్దరిని మధ్య దూరం పెంచేసింది. అమ్మ అని ఒక పిలుపు వల్ల నువ్వు నేను ఇప్పుడు దూరం అవుతున్నాము అని అనుకుంటాడు.ఇంతలో జగతి అక్కడికి వచ్చి మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి సార్ అని అంటుంది.
 

రిషి, మీటింగ్లో మాట్లాడదాము అని అంటాడు. ఆ తర్వాత రిషి అక్కడికి వెళ్లి మీటింగ్ మొదలుపెడతాడు. మిషన్ ఎడ్యుకేషన్ విషయం గురించి ఒక కొత్త ఆలోచనను విద్యాశాఖ మంత్రి గారి చెప్పబోతున్నారట అని చెప్తాడు. అప్పుడు జగతి, విద్యాశాఖ నుంచి ఎవరో కోఆర్డినేటర్ వచ్చి మనకి దాని గురించి చెప్తా అన్నారు అని చెప్తుంది. అవును మేడం వస్తా అన్నారు.ముందు వాళ్ళు చెప్పినవి విందాము అర్థం కాకపోతే తర్వాత మనలో మనం చర్చించుకుందాం అని అంటాడు. ఇంతలో వసుధార అక్కడికి వస్తుంది.
 

విద్యాశాఖ నుంచి వచ్చిన కోఆర్డినేటర్ ని నేనే అని చెప్తుంది. అప్పుడు రిషి, వసుధారా ఉద్యోగానికి అప్లై చేసినట్టు కూడా నాకు చెప్పలేదు అని అనుకుంటాడు రిషి. అప్పుడు వసు లోపలికి వచ్చి, అందరికీ నమస్కారం మెషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అని అంటుంది. దానికి అందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు వసు, మిషన్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పటివరకు పిల్లలు చదువులు గురించి అనుకున్నాము కానీ, ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్నాము.ప్రతి ఇంట్లో పిల్లలు చదువును, పెద్దల ఆరోగ్యాన్ని దృష్ట్యా ఈ స్కీమ్ అమలుపారుస్తున్నాము. దానికోసం మనం అవగాహన క్యాంపు పెట్టి అంచుల అంచులుగా ఈ స్కీమ్ ని అమలుపరచాలి అని అనగా అందరూ చప్పట్లు కొడతారు.

అప్పుడు వసు ఫైల్స్ రిషికిచ్చి దీని మీద సంతకాలు కావాలి అని అంటుంది.అప్పుడు రిషి మనసులో, ఉద్యోగానికి అప్లై చేసినట్టు కూడా నాకు చెప్పలేదు అని అనుకుంటాడు. అప్పుడు వసు మనసులో, మీకు చెప్పలేదు అని కోపంగా ఉన్నారా సార్ అని అనుకుంటుంది.అప్పుడు రిషి,జగతి మేడం ఈ ఫార్మాలిటీస్ అన్ని మీరే చూసుకోండి అని అనగా వసు, మీ సంతకమే కావాలి సార్ అని అంటుంది. అప్పుడు రిషి లాప్టాప్ క్లోజ్ చేద్దాము అనుకోగా అది చేతికి తగులుతుంది. అప్పుడు అందరూ ఏమైంది అని కంగారు పడతారు. ఏమీ లేదు అని రిషి వాళ్ళను పంపించేస్తాడు. అప్పుడు వసు కూడా వాళ్ళ వెనకాతలే వెళ్ళినట్టు వెళ్లి వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ రిషి దగ్గరికి వచ్చి, చూసుకోవాలి కదా సార్! జాగ్రత్త గా ఉండాలి. నొప్పిగా ఉందా అని చేతిని పట్టుకుంటుంది అప్పుడు రిషి, కొన్ని ఎంత జాగ్రత్తగా ఉన్నా మన చేతుల్లో ఉండవు వసుధార.
 

మినిస్టర్ గారు కలవడానికి ఎప్పుడు రమ్మన్నారు అని అడగగా, మీటింగ్ అయిపోయిన వెంటనే రమ్మన్నారు అని అంటుంది వసు. ఆ తర్వాత సీన్లో, ఇంట్లో హాల్లో గౌతం గేమ్స్ ఆడుకుంటూ ఉండగా దేవయాని అక్కడికి వస్తుంది. గౌతమ్,అంతా బానే ఉందా అని అనగా, బానే ఉన్నది పెద్దమ్మ అని అంటాడు గౌతమ్. అదే ఇందాక నువ్వు, జగతి, మహీంద్ర గదిలో మాట్లాడుకున్నారు కదా ఏమైంది అని అనగా, అమ్మ పెద్దమ్మ! మా మీద కూడా చెవులు పడ్డాయా అని మనసులో అనుకొని, ఏమీ లేదు పెద్దమ్మ వంటల గురించి మాట్లాడుకున్నాము.ఏ వంటలు రిషికి నచ్చుతాయో అనుకున్నాము అని అనగా, అంతేనా అది కాకుండా రిషి వసుదారల గురించి ఏం మాట్లాడుకున్నారు అని అడుగుతుంది దేవయాని. అప్పుడు గౌతమ్ మనసులో, మీరు ఎంత అడిగినా నా నుంచి ఏ సమాధానం బయటికి రాలేదు పెద్దమ్మ.ఏం చేసినా మీరు ఏదో ఒక చెడు చేస్తూనే ఉంటారు అని అనుకోని, ఏమీ లేదు పెద్దమ్మ రిషికి కోపం ఎక్కువ కదా దాని గురించి మాట్లాడుకుంటున్నాము అని అంటుంది. అప్పుడు దేవయాని మనసులో, నాకు తెలుసు గౌతమ్ నువ్వు కూడా నాకు ఏం చెప్పడం లేదు.
 

ఎన్నాళ్ళు మీరు ఇలా దాస్తారో నేను చూస్తాను అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో, మహేంద్ర మినిస్టర్ కి ఫోన్ చేసి థాంక్యూ సర్ అడిగిన వెంటనే వసుధారకి అక్కడ జాబ్ ఇప్పించినందుకు అని అనగా, వసుధార జెమ్ లాంటిది.తను ఇక్కడ ఉండడం మా అదృష్టం ఎన్నాళ్లు ఉండమంటే అన్నాళ్లు ఉండనివ్వండి అని మినిస్టర్ అంటాడు. ఆ తర్వాత సీన్లో రిషి మినిస్టర్ ఆఫీస్ ఎదురుగుండా ఉంటాడు. అంతలో వసు క్యాబ్లో వస్తుంది.నీ కార్ ఏది అని రిషి అనగా, నాకు కార్ ఎందుకు ఉంటుంది సార్ అని వసు అంటుంది.అంటే చెప్పకుండా జాబ్ లో జాయిన్ అయ్యావు కదా చెప్పకుండా కారు కూడా ఇచ్చారేమో అని అనుకున్నాను అని రిషి అనగా, లేదు సార్ క్యాబ్ లో వచ్చాను అని అంటుంది వసు. 

అప్పుడు రిషి, నాకు చెప్పకుండా ఎందుకు జాయిన్ అయ్యావు అని అనగా ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకని అప్లై చేశాను సార్. అది వస్తాదో రాదో తెలీదు. అనుకోకుండా వచ్చేసింది అని వసు అంటుంది. నువ్వు ముందు నా దగ్గర అసిస్టెంట్ గా పని చేశావు అదైనా గుర్తున్నాదా అని రిషి అనగా, అది కాలేజీలో కదా సార్ అప్పుడు మీ దగ్గర జీతం తీసుకుని అసిస్టెంట్ లా పని చేశాను.ఇప్పుడు జీతం లేకుండా జీవితాంతం మీ దగ్గర పనిచేస్తున్నాను అని వసు అంటుంది.ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!