Karthika Deepam: ఇంటికి వచ్చి మోనితకు షాకిచ్చిన దుర్గ, దీపలు.. కార్తిక్ ముందే డాక్టర్ బాబు అంటూ?

First Published Sep 30, 2022, 7:45 AM IST

Karthika Deepam:బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్,కుటుంబ కథా నేపథ్యంతో కొనసాగుతూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు సెప్టెంబర్ 30వ తేదీన ఏం జరుగుతుందో తెలుసుకుందాం...
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే...దుర్గా మోనిత కోసం వెతుకుతాడు.ఇటువైపు వచ్చింది కదా ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇటువైపు వెళ్లిందంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండి ఉంటుంది. రేపు ఉదయం వచ్చి వెతుకుదామని అనుకుంటాడు. ఆ తర్వాత సీన్లో మోనిత ఇంట్లో కూర్చొని, కార్తీక్ నాకు ఒకడికే కనిపించాడు ఇంక హాయిగా ఉందామనుకున్న సమయంలో, దీపొచ్చింది. తర్వాత ఆంటీ,అంకుల్ వచ్చారు. ఇందాక శౌర్య వచ్చింది. ఇప్పుడు వీడు వచ్చాడు. అందరూ కలిసి వస్తున్నారా లేకపోతే ఇదేమైనా ప్లానా! అయినా నేనెందుకు భయపడాలి అందరూ కలిసి వచ్చిన సరే ఎవరు గతం గుర్తు చేయడానికి ప్రయత్నించిన కార్తీక్ ప్రాణాలకే ప్రమాదం అన్నారు కదా ఇంకా! దీప అలాంటి పనిచేయదు అని అనుకుంటుంది.
 

 ఇంతలో కార్తీక్ పడుకున్నప్పుడు దీప, శౌర్య ఎక్కడున్నారు? రౌడీ త్వరగా రా అని కలవరిస్తూ ఉంటాడు. ఇంతలో అది విన్న మోనిత భయపడి కార్తీక్ కి గతం గుర్తొచేసిందా అని అనుకుంటుంది.ఇంతలో శివ అక్కడికి వస్తాడు. శివ కూడా ఆ మాటలు వింటాడు. ఇంతలో మోనిత, శివని బయటికి పంపించేస్తుంది. సర్ ఏంటి దీపక్క పేరు, ఎవరో రౌడీ పేరు చెబుతున్నారు కచ్చితంగా మేడమ్, సార్ భార్య కాదు దీపక్కే సార్ భార్య అయ్యుంతుందా! ఏంటో అంత తికమక గా ఉంది అని అనుకుంటాడు.ఆ తర్వాత సీన్లో దుర్గా ఆ సందు లో  మోనిత కోసం వెతుకుతాడు. ఎక్కడా కనిపించట్లేదు ఎవరినైనా అడుగుదాము అని దీప ఇంటి ఎదురుగుండా వచ్చేసరికి దీప దుర్గ ని చూస్తుంది.
 

 దుర్గ అని బయటికి వచ్చి దేవుడికి ఇప్పుడే దారి చూపమన్నాను అప్పుడే దుర్గని పంపించాడు అని అనుకుంటుంది. ఇంతలో దుర్గ దీప ని చూసి,దీపమ్మ నువ్విక్కడున్నావ్ ఏంటి దీపమ్మ? కార్తీక్ సార్ ఎలా ఉన్నారు పిల్లలు బాగున్నారా అని అడగగా దీప జరిగిన విషయం అంతా చెప్తుంది. అది కార్తీక్ సర్ వెంట పడుతుందని తెలుసు కానీ మరీ ఇంత దారుణానికి దారితీస్తుందని అనుకోలేదు. దాని పని చెప్తాను అని అనుకుంటాడు. ఇంతలో దుర్గ పొలమరుతాడు. దీప మంచినీళ్లు తెచ్చేలోగా దుర్గా అక్కడి నుంచి మాయమైపోతాడు. ఆ తర్వాత రోజు కార్తీక్ లేచి తలనొప్పిగా ఉన్నది మోనిత, తలరుద్దు అని అడగగా ఇప్పుడు తల రుద్దితే గతం గుర్తొస్తుందేమో అని మోనిత భయపడి కార్తీక్, డాక్టర్లు చెప్పారు కదా తలని రుద్దొద్దు, తలని కదపొద్దు అని అనగా కార్తీక్, తలరుద్దినంత మాత్రాన మెదడులో సెరటోనియల్ లెవెల్స్ తగ్గవు అని అంటాడు.
 

అప్పుడు మోనిత, నిన్న రాత్రి భార్య, పిల్లలు అని కలవరించాడు. ఇప్పుడు డాక్టర్లా మాట్లాడుతున్నాడు ఏం చేయాలి అని అనుకునే సమయంలో మేడం అని ఎవరో పిలుస్తారు.ఇంతలో మోనిత హమ్మయ్య ఎవరో వచ్చినట్టున్నారు అనుకోని కార్తీక్,ఎవరో వచ్చారు నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడ దుర్గని చూసేసరికి మోనిత ఆశ్చర్య పోతుంది. దుర్గా నేను చాలా హీనమైన పరిస్థితిలో ఉన్నాను దయచేసి నన్ను వదిలేయ్ నీకు ఎంత కావాలో చెప్పు ఇచ్చేస్తాను అని అనగా, నాకు ఇప్పుడు డబ్బులు అవసరం ఏం లేదు బంగారం. బానే సంపాదిస్తున్నాను అయినా నన్ను చూసిన తర్వాత మాట్లాడతావ్ అనుకుంటే పారిపోయావు అందుకే నేనే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను  నా దగ్గర డబ్బులు, వైభోగం అన్నీ ఉన్నాయ్ కాని ఎంజాయ్మెంట్ లేదు అందుకే నీ దగ్గర ఉన్న నాలుగు రోజులు ఉందామని వచ్చాను అని అంటాడు. 
 

దానికి మోనిత కోపంతో వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని అనగా ఇంతలో శివ అక్కడికి వస్తాడు. మేడం ఎవరితను అని శివ అడుగుతాడు. అప్పుడు దుర్గా, నేనూ మీ మేడం క్లోజ్ ఫ్రెండ్ ని అనగా మోనిత, నాకు ఇతను తెలుసు శివ కానీ ఇతని బుద్ధి మంచిది కాదు పంపించే అని అనగా శివ, ఎవడ్రా నువ్వు అని దుర్గ భుజం మీద చెయ్యేస్తాడు. అప్పుడు మోనిత బయటకు తీసుకువెళ్లిపో శివ ఇతన్ని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దుర్గా చేయి తీయరా అని అంటాడు కాని శివ చేయ తీయడు. ఆ తర్వాత దుర్గ దీప దగ్గరికి వస్తాడు. మంచినీళ్లు అని అడిగి ఎక్కడికి వెళ్ళిపోయావు దుర్గ అని అనగా, ఆ మోనితకి చిన్న షాక్ ఇద్దామనుకొని వెళ్ళానమ్మ కానీ అక్కడ అది పెద్ద షాకే తిన్నది అని అంటుంది.
 

అప్పుడు దీప, చెప్పాను కదా దుర్గ డాక్టర్ బాబు కి గతం గుర్తు రాకూడదు అని అనగా, అందుకే దీపక్క నేను దాని దగ్గరికి వెళ్ళాను డాక్టర్ బాబుకి కనిపించలేదు. ఒకవేళ కనిపించినా సరే గతం గురించి ఏం ప్రస్తావనతను ఇప్పుడు మనం నయం చేయాల్సింది కార్తీక్ సార్ కి కాదు ఆ మోనితకి తనంతట తానే, నేను మీ భార్యను కాదు దీపే మీ భార్య అని చెప్పించేలా చేస్తాను అని అంటాడు దుర్గా. అప్పుడు దీప ఆనందపడి, నా శక్తికి మించి చాలా ప్రయత్నాలు చేశాను దుర్గా ఇంక నావల్ల కాదు అనుకునే సమయంలో నువ్వు నాకు తోడుగా వచ్చావు. దేవుడే నిన్ను పంపించినట్టున్నాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత సీన్లో మోనిత కంగారుగా కార్తీక్ దగ్గరికి వెళ్లి కార్తీక్ మనము ఇల్లు మారిపోదామని అంటుంది.
 

ఇంకా భయపడుతున్నావా అని కార్తీక్ అనగా, లేదు కార్తీక్ ఎవరి మీద భయంతోనే నేను వెళ్లడం లేదు కేవలం నాకు ఊరి బయట ఇల్లు తీసుకోవాలని ఉంది అని అనగా కార్తీక్,ఆలోచిద్దాంలే! శివ ఎక్కడున్నాడు అని శివని వెతుక్కుంటూ వెళ్తాడు. చూసేసరికి బయట శివా కళ్ళు తిరిగి కిందపడి ఉంటాడు. అప్పుడు కార్తీక్ శివ చేతి నీ పట్టుకుని హార్ట్ బీట్ చూసి వెళ్లి మంచి నీళ్ళు తీసుకురమ్మని అంటాడు. మంచినీళ్లు మొఖం మీద కొట్టి లేపేసరికి మోనిత భయపడి డాక్టర్లా ప్రవర్తిస్తున్నాడేంటి అని అనుకుంటుంది. అప్పుడు కార్తీక్ శివతో ఏమైంది పడిపోయావు అని అనగా ఇందాక ఎవరో వచ్చారు సార్.మేడం బెస్ట్ ఫ్రెండ్ అంట మేడం బయటకు పంపించమన్నారు తన భుజం మీద చెయ్యేసాను, అప్పడు కొట్టాడు అంతే ఇప్పుడే లేచాను అని అంటాడు శివ.అప్పుడు కార్తీక్,బెస్ట్ ఫ్రెండ్ అయ్యుంటే బయటకు పంపించడం ఎందుకు అని మోనితని అడగగా ఇంతలో దుర్గ వచ్చి నమస్తే సార్ నేను మీనిత ప్రాణ స్నేహితుడిని. నా మీద అలిగింది అందుకే నాతో సరిగ్గా మాట్లాడటం లేదు అని అంటాడు. నీ మీద ఎందుకు అలగడం అని కార్తీక్ అనగా స్నేహితులు, ప్రేమికులు,భార్యాభర్తలు ఎందుకు అడుగుతారు సార్. 

వాళ్ళకి నచ్చింది ఇవ్వకపోతే అలుగుతారు. అలాగే నేను మీ పెళ్లికి ముందు ఒకటి ఇవ్వలేకపోయాను అందుకే అలిగింది, అందుకే మీ పెళ్లికి కూడా నన్ను పిలవలేదు. నాకు ఈ ఊర్లో కొంచెం బిజినెస్ పనున్నది అలాగే హోటల్లో ఉండడం ఎందుకు ఇక్కడే నాలుగు రోజులు ఉంటే మోనిత అలక తీర్చినట్టు ఉంటుంది అనుకున్నాను కానీ అది నన్ను బయటకి తోసిసింది అని అంటాడు.ఇంతలో దీప వచ్చి తమ్ముడు శివ గోంగూర పచ్చడి అడిగావు కదా ఇదిగో అని ఇస్తుంది. అప్పుడు దుర్గను చూసిన దీప, ఎవరండీ తను అని కార్తీక్ ని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, మోనిత స్నేహితుడట అని కార్తీక్ అంటాడు. అప్పుడు మోనిత కచ్చితంగా వీళ్ళిద్దరూ ఏదో నాటకం వేస్తున్నారు. నన్ను ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా చేస్తున్నారు అని అనుకుంటుంది. అప్పుడు దుర్గ, నేను వెళ్లి హోటల్ లో ఉంటానులెండి ఇక్కడ తనకు ఇష్టం లేనట్టు ఉన్నది అని అంటుంది. అప్పుడు కార్తీక్ దుర్గని ఆపుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!