ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.... సాక్షి, వసుధార దగ్గరకు వచ్చి తెగ గొప్పలు చెప్పుకుంటూ మురిసిపోతుంటాది. ఆట ముగిసింది,నేనే గెలిచాను,నువ్వు ఎప్పటికీ గెలవలేవు. రిషి నా సొంతం అని సంబరపడిపోతుంటాది సాక్షి. వసుధార, సాక్షికి శుభాకాంక్షలు చెప్పి, ఆట అయిపోలేదు, అసలు ఆట "మా ఇద్దరి ప్రేమ గెలిచి, అది నువ్వు చూసినప్పుడు" ముగుస్తుంది అని అంటుంది. సాక్షి మాత్రం చాలా పొగరుగా "నువ్వు రిషి గురించే కలలు కంటూ మిగిలిపో, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను.