అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా థాంక్యూ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. అయితే థాంక్యూ చిత్రం చైతూకి నిరాశనే మిగిల్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి షాకే తగిలింది.
అక్కినేని నాగ చైతన్య రీసెంట్ గా థాంక్యూ చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. అయితే థాంక్యూ చిత్రం చైతూకి నిరాశనే మిగిల్చింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద గట్టి షాకే తగిలింది. దీని నుంచి మూవ్ ఆన్ అవుతున్న చైతు లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ తో బిజీ అయ్యాడు.
26
నాగ చైతన్య అమీర్ ఖాన్ తో కలిసి నటించిన లాల్ సింగ్ చడ్డా చిత్రం ఆగష్టు 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అమీర్ ఖాన్ స్నేహితుడు బాలరాజు పాత్రలో చైతు ఈ చిత్రంలో నటిస్తున్నాడు. నాగ చైతన్య డెబ్యూ బాలీవుడ్ మూవీలో చైతు ఎలా నటించాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
36
తెలుగు ఆడియన్స్ ఇలాంటి రోల్ లో యాక్సెప్ట్ చేస్తారా అనే ప్రశ్నకు నాగ చైతన్య బదులిచ్చాడు. ఇది అమీర్ ఖాన్ చిత్రం. నేను ఈ మూవీలో స్పెషల్ రోల్ మాత్రమే చేస్తున్నాను. ఆ సంగతి తెలుగు ఆడియన్స్ కి తెలుసు కాబట్టి వాళ్ళు ఓపెన్ మైండ్ తో వస్తారు అని నాగ చైతన్య అన్నారు.
46
ఇక చైతు సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్ పై స్పందించాడు. సమంతతో విడాకుల గురించి మాట్లాడుతూ.. మేమిద్దరం ఏం చెప్పాలనుకున్నామో అది ఆల్రెడీ చెప్పేశాం. నా లైఫ్ లో మంచి అయినా చెడు అయినా మీడియాకు చెప్పే ముందుకు వెళతాను. విడాకుల తర్వాత సమంత బిజీ అయిపోయింది. నా పని నేను చేసుకుంటున్నా. సోషల్ మీడియాలో వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమే అని నాగ చైతన్య తెలిపాడు.
56
Image: Naga Chaitanya/Instagram
మీడియాకి చెప్పాల్సింది చెప్పాం.. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి విషయం తెలుసు. అంతకి మించి మాట్లాడాల్సింది ఏమి లేదు అని చైతు తెలిపాడు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య పై విధంగా స్పందించాడు.
66
నాగ చైతన్య ప్రస్తుతం.. దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇక చైతు త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించబోతున్నాడు. సర్కారు వారి పాట దర్శకుడు పరశురామ్ తో కూడా ఒక చిత్రం ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.