ఎవరు ఎత్తుకెళ్లారు? అని కంగారుగా నిరూపమ్ అడగగా ఆ బిచ్చగాడు వీధి చివర ఒక బంగ్లా ఉంటాది,అక్కడికే తీసుకెళ్ళు ఉంటారు అని చెప్తాడు. ఇంకోవైపు హిమ,ప్రేమ్ కూడా శౌర్య ని వెతుక్కుంటూ ఉంటారు. ఈ లోగ నిరూపమ్ వాళ్లకి ఖాళీగా ఉన్న ఆటో గురించి మాత్రమే చెబుతాడు ఈ కిడ్నాప్ సంఘటన చెప్పడు.నిరూపమ్ ఆ బంగ్లా కి వెళ్తాడు. వెళ్లి శౌర్య కట్లు విప్పడానికి చూస్తే, ఆ రౌడీలు నిరుపమ్ ని అడ్డుకుంటారు. నిరుపమ్ వాళ్లందరినీ కొట్టి సౌర్యని కాపాడతాడు. ఆ రౌడీలు వెళ్తూ, వెళ్తూ తలుపులన్నీ వేసేసి వెళ్లిపోతారు.