Guppedantha Manasu: ఐ లవ్యూ చెప్పిన రిషీకి అల్టిమేట్ షాకిచ్చిన వసుధర.. సాక్షి వల్లే ఇదంతా?

Published : May 27, 2022, 08:30 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

PREV
16
Guppedantha Manasu: ఐ లవ్యూ చెప్పిన రిషీకి అల్టిమేట్ షాకిచ్చిన వసుధర.. సాక్షి వల్లే ఇదంతా?

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే రిషి (Rishi) ఈరోజు నాకు కొత్త సంవత్సరంలా అనిపిస్తుంది అని వసు (Vasu) తో అంటాడు. ఇక నా జీవితంలో నేను ఎక్కువ మాట్లాడిన మొదటి అమ్మాయి వి నువ్వు అంటాడు. ఇక చిరునవ్వుల అంటే ఏంటో తెలియని నాకు.. చిరునవ్వులు పుట్టించావు అని అంటాడు.
 

26

ఇక రిషి (Rishi) కారులో ఉన్న గిఫ్ట్ తెచ్చి వసుకు ఇస్తాడు. గిఫ్ట్ ఓపెన్ చేసిన వసు (Vasu) ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇక రిషి ఐ లవ్ యు వసు నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. ఆ మాటకు వసు ఎంతో ఆనంద పడుతుంది. ఇక రిషి ను వసు వెనక నుంచి గట్టిగా వాటేసుకుంటుంది.
 

36

మీరంటే నాకు కూడా చాలా ఇష్టం సార్ అని అంటుంది. ఇక రిషి (Rishi) ఐ లవ్ యు సో మచ్ అంటూ వసు ను ఎత్తుకొని మరీ తిప్పుతాడు. ఇక జరిగిందంతా రిషి ఊహించుకుంటాడు. ఇక వసు (Vasu) మీరు కూడా నాకు ఇష్టం సార్ ఒక మంచి మంచి వ్యక్తి లా.. మేడం కొడుకులా నాకు ఇష్టం అని అంటుంది.
 

46

ఇక మీలాంటి గొప్ప వ్యక్తి మా జీవితంలోకి రావడం నా అదృష్టం అని వసు (Vasu) అంటుంది. ఇక సాక్షి (Sakshi) కి నాకు ఒకప్పుడు ఎంగేజ్మెంట్ అయ్యింది అని రిషి అంటాడు. ఇక తన మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు అంటాడు. ఇక వసు మీరు ఒక గిఫ్ట్ తెచ్చి ఐ లవ్ యు అంటే .. నేను కూడా ఐ లవ్ యు అంటానని మీరు ఎలా అనుకుంటున్నారు అని రిషి కి షాక్ ఇస్తుంది.
 

56

ఇక మిమ్మల్ని చాలా దగ్గరగా చుడడం .. మీతో ఆత్మీయంగా ఉండడం కూడా నాకు చాలా ప్రాబ్లం అయింది అని వసు (Vasu) అంటుంది. అంతేకాకుండా మీది ప్రేమ కాదని నాకు అనిపిస్తుంది అని అంటుంది. నాది ప్రేమ కాదని నువ్వు ఎలా చెప్తున్నావ్? వసు అని రిషి (Rishi) అడుగుతాడు.
 

66

దానితో వసు (Vasu) ఇప్పుడు సాక్షి తిరిగి వచ్చిందనే.. నా పైన మీకు ప్రేమ పుట్టింది అని అంటుంది. ఆ మాటతో రిషి (Rishi) ఒక్క సారిగా స్టన్ అవుతాడు. ఇక ఆ మాటకు అసహనం వ్యక్తం చేసిన రిషి వసుధార అంటూ గట్టిగా విరుచుకు పడతాడు. ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories