Guppedantha Manasu: ప్రాజెక్ట్ రద్దు చేస్తూ జగతికి షాకిచ్చిన రిషి.. కోపంతో రగిలిపోతున్న వసు!

Published : Mar 15, 2022, 09:55 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu ) సీరియల్ ప్రేక్షకాదరణను భారీ స్థాయిలో పొందింది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రిషి (Rishi) జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉండగా వాళ్ల పెద్దమ్మ వచ్చి మరిన్ని మాటలను విసురుతుంది.

PREV
16
Guppedantha Manasu: ప్రాజెక్ట్ రద్దు చేస్తూ జగతికి షాకిచ్చిన రిషి.. కోపంతో రగిలిపోతున్న వసు!
Guppedantha Manasu

ఇక అదే క్రమంలో దేవయాని రిషి కు జగతి (Jagathi) గురించి నెగిటివ్ గా నూరిపోస్తుంది. రిషి కూడా వాళ్ల పెద్దమ్మ మాటలు నిజంగానే నమ్ముతాడు. ఇక దేవయాని (Devayani) హమ్మయ్య నేను వచ్చిన పని అయిందా అంటూ మనసులో అనుకుంటుంది.
 

26
Guppedantha Manasu

ఆ తర్వాత రిషి (Rishi) పొద్దున్నే కాలేజీకి త్వరగా రా నీతో పనుంది అని వసుకు టెక్స్ట్ పెడతాడు. ఇక వసు త్వరగా రెడీ అయ్యి రిషి దగ్గరకి వెళుతుంది. రిషి వసు (Vasu) కు ఒక లెటర్ ఇచ్చి ఇది మీ మేడం గారికి ఇవ్వమని చెబుతాడు.
 

36
Guppedantha Manasu

ఇక ఆ లెటర్ ను వసు జగతి (Jagathi) కి ఇస్తుంది. ఆ లెటర్ చదివిన జగతి ఆశ్చర్య పోయి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. అది చూసిన వసు కు ఏమీ అర్ధం కాదు. ఇక ఆ లెటర్ లో మిషిన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు రద్దు చేసినట్టు ఆ లెటర్లో రాస్తాడు. అది చదివిన వసు (Vasu) ఎంతో కోపం వ్యక్తం చేస్తుంది.
 

46
Guppedantha Manasu

ఇక రిషి (Rishi) దగ్గరికి కోపంగా వెళ్లిన వసు అనేక మాటలతో రిషి పై విరుచుకు పడుతుంది. రిషి తెలివిగా కవర్ చేసుకుందామని చూస్తాడు. కానీ వసు (Vasu)  ఏ మాత్రం తగ్గకుండా మేడం ను ఇన్ డైరెక్ట్ గా వద్దంటున్నారా అని అడిగేస్తుంది.
 

56
Guppedantha Manasu

ఇక వసు జగతి (Jagathi)  విషయంలో సపోర్ట్ చేస్తూ ఉండగా రిషి ఈ కాలేజ్ ఎండిను నేను అని తన మాటలతో వసు నోటిని కట్టి పడేస్తాడు. ఇక వీరిద్దరి కన్వర్జేషన్ మొత్తం మహేంద్ర (Mahendra) కూడా వింటాడు.
 

66
Guppedantha Manasu

ఏం చేస్తున్నావ్ రిషి (Rishi) అని మహేంద్ర అడగగా.. డాడ్ ఇది నా నిర్ణయం అంటూ మహేంద్రపై విరుచుకు పడతాడు రిషి. మరోవైపు వసు (Vasu)  ఇంటికి వెళ్లి తలుపులు తెరిచి స్టన్ అవుతుంది. కాగా ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

click me!

Recommended Stories