Radhe Shyam:‘రాధే శ్యామ్’ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్ ఫిక్స్, ప్లాట్ ఫాం ఏదంటే

First Published | Mar 15, 2022, 9:35 AM IST

మన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి.


 పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన  మూవీ ‘రాధే శ్యామ్’. అద్భుతమైన ఓపినింగ్స్ తో మొదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ తో కష్టమనిపించుకుంది.  ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్‌ ప్రేరణ పాత్ర పోషించింది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమకథ చిత్రం రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు మీడియా వర్గాల సమచారం.

1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో సాగిన ఈ  లవ్‌స్టోరీ ని డివైడ్ టాక్ తో చాలా మంది థియోటర్స్ కు వెళ్లలేదు. దాంతో వాళ్లంతా  ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి ప్రేక్షకులను ఆనందపరిచే ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతొంది. బిగ్‌స్క్రీప్‌ సందడి చేస్తోన్న ఈమూవీ త్వరలో డిజిటల్‌ ప్లాట్‌ఫాంపై అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.


 ఈ మూవీ మొదట్లో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే తొలి రోజే ఓ వర్గం ప్రేక్షకులు మూవీ ప్లాప్‌ అంటూ ప్రచారం చేయగా మరో వర్గం ప్రేక్షకులు,ప్రభాస్ ఫ్యాన్స్  మాత్రం   హిట్‌ అన్నారు. రాధేశ్యామ్‌ పిరియాడికల్‌ లవ్‌స్టోరీ అని ముందు నుంచి డైరెక్టర్‌, మూవీ టీం చెబుతూనే ఉంది.


పూర్తి ప్రేమకథ అని భావించిన వారిని ఈ మూవీ ఆకట్టుకోగా.. మరికొందరిని మాత్రం నిరాశ పరిచింది. దీనికి కారణంగా రాధేశ్యామ్‌లో ఒక్క యాక్షన్‌ ఎలిమెంట్‌ కూడా లేకపోవడమే. అంతేకాదు పాన్‌ ఇండియా చిత్రం, రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌ మూవీ, పైగా ప్రభాస్‌ సినిమా.. అందులో ఒక్కటంటే ఒక్క ఫైట్‌ సీన్‌ లేదు, ఓ కామెడీ లేదంటూ మాస్‌ ఆడియన్స్ అంటున్నారు.


 ఈ క్రమంలో ఇటీవల రాధేశ్యామ్‌ సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ రాధాకృష్ణ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మూవీలో యాక్షన్‌ సీన్స్‌ లేవని వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించాడు. వెజిటేరియన్‌ హోటల్‌కు వెళ్లి చికెన్‌ బిర్యానీ పెడతారని ఎలా ఆశిస్తారు? అని ప్రశ్నించాడు.


 అంతేకాదు రాధేశ్యామ్‌ ఇంటెన్సీవ్‌ లవ్‌స్టోరీ అని ముందు నుంచే చెబుతున్నామని, ఓ ప్రేమకథ నుంచి ఇంకేం ఆశిస్తారంటూ మండిపడ్డాడు. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా కనిపించగా, పూజా డాక్టర్‌ ప్రేరణ పాత్ర పోషించింది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ ప్రేమకథ చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 151 కోట్ల కలెక్షన్‌ రాబట్టి క్రియేట్‌ చేసింది. 

మన రాత అనేది చేతుల్లో ఉండదు.. చేతల్లో ఉంటుందనే విషయాన్ని ఓ ప్రేమ కథతో మరోసారి ప్రపంచానికి గుర్తు చేశాడు దర్శకుడు రాధాకృష్ణ. ఓ అందమైన ప్రేమకథని గ్రాండ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కథలో ఎలాంటి మలుపులు ఉండవు కానీ.. లొకేషన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాత్రం ప్రేక్షకుడి మనసు దోచుకుంటాయి. ఇటలీలోని బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో కథ.. అలా సాగిపోతుంది

రాధేశ్యామ్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, అందులోనే ప్రభాస్‌ మూవీ కావడంతో పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్‌, శాటిలైట్‌ రైట్స్‌ను సొంతం చేసుకునేందుకు పోటీ పడ్డాయని సమాచారం. దాదాపు 300 కోట్లు దాకా పెట్టుబడి పెట్టారని చెప్పబడుతున్న ఈ చిత్రం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాధే శ్యామ్ రికార్డ్ క్రియేట్ చేసిందంటున్నారు. శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఆల్ టైం రికార్డు ధరకు అమ్ముడయ్యాయి.

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్‌ ప్రైం భారీ ఎగ్రిమెంట్ తో  రాధేశ్యామ్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందని సమచారం. ఇక ఏ సినిమా అయిన థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం 4 వారాల తర్వాతే డిజిటల్‌ ప్లాట్‌ఫాంకు వస్తుంది.


ఇండస్ట్రీ లెక్కలు ప్రకారం రాధేశ్యామ్‌ ఏప్రిల్‌ 11 తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాలి. కానీ ఏప్రిల్‌ 2న ఉగాది పండగ ఉండటంతో ఆ రోజే మధ్యాహ్నం 12 గంటల నుంచి రాధేశ్యామ్‌ స్ట్రీమింగ్‌ చేయాలని అమెజాన్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజం ఉందనేది ప్రకటన వస్తే కానీ తెలియదు.

Latest Videos

click me!