Guppedantha Manasu: వసుకు బాగా దగ్గరవుతున్న రిషి.. వార్నింగ్ ఇవ్వడానికి సిద్దమైన దేవాయని?

Navya G   | Asianet News
Published : Dec 09, 2021, 12:04 PM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగు లో మొదటి స్థానంలోనే దూసుకెళ్తుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.  

PREV
17
Guppedantha Manasu: వసుకు బాగా దగ్గరవుతున్న రిషి.. వార్నింగ్ ఇవ్వడానికి సిద్దమైన దేవాయని?

కారు రిపేర్ రావడంతో కారు దగ్గర మెకానిక్ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు వసు (Vasu), రిషి (Rishi). ఇక వసు ఏదైనా పాట పాడితే బాగుంటుంది కదా అని సరదాగా మాట్లాడుతుంది. ఇక తనకు దూరం నుంచి డప్పుల సౌండ్ రావటంతో అక్కడికి రిషిని తీసుకెళ్తుంది.
 

27

ఇక అక్కడ కొందరు పల్లె గాయకులు డప్పు వాయించుకుంటూ చలిమంటలు కాల్చుకుంటూ ఉండగా వసు (Vasu) సంతోషంగా వెళ్తుంది. రిషి తన మనసులో వసు సంతోషం గురించి ఆలోచిస్తాడు. ఇక వాళ్ళు పాట పాడటం తో రిషి (Rishi), వసులు కూడా డప్పు వాయిస్తూ సరదాగా గడుపుతారు.
 

37

మరోవైపు దేవయాని (Devayani) సోఫాలో నిద్ర పోతూ ఉండగా మహేంద్ర వర్మ వచ్చి తనని పిలిచి అక్కడినుండి వెళుతుండగా.. దేవయాని లేచి రిషి ఇంకా రాలేదు అంటూ బాధ్యత లేదా అన్నట్లు మాట్లాడుతుంది. వెంటనే మహేంద్రవర్మ (Mahendra Varma) మీ పెంపకంపై మీకు నమ్మకం లేదేమో అని అంటాడు.
 

47

ఇక రిషి (Rishi) వసును ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక ఇంటి డోర్ కొట్టి నీకు ఒకటి చెప్పాలి వసుధారా అని అనడంతో అప్పుడే జగతి (Jagathi) డోర్ తీస్తుంది. ఆలస్యమైందని అది చెప్పడానికి వచ్చాను అంటాడు రిషి. కాఫీ తాగమని వసును అడగమనడంతో ఇప్పుడు కాఫీ తాగే సమయం కాదని అక్కడనుంచి వెళ్ళి పోతాడు.
 

57

రిషి (Rishi) ఇంటికి వెళ్లేసరికి మహేంద్ర సోఫాలో పడుకొని ఉంటాడు.  తల్లి తండ్రి తన కోసం ఎదురు చూశాడు అని రిషి మహేంద్ర వర్మ (Mahendra Varma) ని తీసుకొని వెళ్తాడు. మరోవైపు వసుధార రిషి సర్ తనకు ఏదో చెప్పాలి అన్నాడు అనుకుంటూ తలుచుకుంటూ ఉంటుంది.
 

67

రిషి (Rishi) పడుకోకుండా వసుతో గడిపిన క్షణాలను తల్చుకుంటూ ఉంటాడు. వెంటనే వసుకి (Vasu) మెసేజ్ చేస్తాడు. ఒక విషయం చెబుతాను అన్న విషయాన్ని ఎందుకు గుర్తుకు చేయలేదు అంటూ కాసేపు తనతో చాటింగ్ యుద్ధం చేస్తాడు.
 

77

తరువాయి భాగం లో రిషి (Rishi) వసు వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్ళటంతో వసు ఫ్లవర్స్ తో స్వాగతం పలుకుతుంది. జగతి ఇంట్లోకి పిలవమని అంటుంది. ఇక దేవయాని (Devayani) వచ్చి వసుని రిషితో ఎక్కడికి వెళ్లావు అని ఎందుకు ఆలస్యం వచ్చావు అని  ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది. మొత్తానికి రిషి వసు కు దగ్గరగా అవుతున్నట్లు అనిపిస్తుంది. మరి ఈ బంధానికి త్వరలోనే ప్రేమ బంధం ఏర్పడేలా అనిపిస్తుంది.

click me!

Recommended Stories