కుంభస్థలాన్ని కొట్టడమే.. హోరెత్తిపోయిన RRR ట్రైలర్, బాక్సాఫీస్ కి చుక్కలే

First Published Dec 9, 2021, 10:50 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తన విజన్ తో మరోసారి యావత్ దేశాన్ని అబ్బురపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర కథా నేపథ్యం అందరికీ తెలిసిందే.

 యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న చిత్రం RRR. దర్శకధీరుడు రాజమౌళి తన విజన్ తో మరోసారి యావత్ దేశాన్ని అబ్బురపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర కథా నేపథ్యం అందరికీ తెలిసిందే. అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల పాత్రలతో జక్కన్న కల్పిత కథని సృష్టించారు. సమ వయస్కులైన వీరిద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు ఒకరికొకరు కలుసుకుని స్నేహితులుగా మారితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై కనివినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. నేడు ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిగ్ డే అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ చిత్ర ట్రైలర్ నేడు విడుదల కానుంది. ముందుగా ఉదయం 10 గంటలకు ట్రైలర్ ని దేశవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ యూట్యూబ్ లో రిలీజ్ కానుంది. 

కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో విడుదలైన ట్రైలర్ గురించి మాటల్లో వర్ణించడం కష్టం. రాజమౌళి తన విజన్, శక్తిని జోడించి బాహుబలిని మించేలా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ఉన్నాడు. ట్రైలర్ లో కథ గురించి ఇంకాస్త క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. బ్రిటిష్ వారికి ఎదురు తిరిగిన కొమరం భీంని నిలువరించే సరైన పోలీస్ అధికారి కోసం వెతుకుతుంటారు. ఆ సమయంలో రాంచరణ్ సరైన వ్యక్తి అని అతడిని రంగంలోకి దింపుతారు. అప్పటి నుంచి భీం, రామ్ మధ్య వార్ మొదలవుతుంది. 

కానీ కొంత కాలానికి బ్రిటిష్ వారు చేసే అరాచకాలకు అల్లూరి సీతారామరాజు రియలైజ్ అవుతాడు. దీనితో అల్లూరి, కొమరం భీం ఇద్దరూ చేతులు కలుపుతారు. అలా ఇలా ఎందుకు.. ఏకంగా కుంభస్థలాన్నే కొడదాం పద అంటూ ఈ ఇద్దరు యోధులు బ్రిటిష్ వారిపై యుద్దానికి రంగంలోకి దిగుతారు. బ్రిటిష్ వారితో వీరిద్దరూ ఎలా పోరాడారు అనేది మిగిలిన కథ. 

ఎలివేషన్ సన్నివేశాలు, ఎమోషనల్ సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ట్రైలర్ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ గ్యారెంటీ. దాదాపు 3 నిమిషాల నిడివి ఉన్న ట్రైలర్ అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించే విధంగా ఉంది. రాంచరణ్, ఎన్టీఆర్ ఎలివేషన్ సన్నివేశాలు, విధ్వంసాలు కళ్ళు చెదిరేలా ఉన్నాయి. 

కొన్ని థియేటర్స్ లో ట్రైలర్ ని మూడు సార్లు రిపీట్ చేశారు. కానీ ప్రేక్షకులు మరొక్కసారి అంటూ గోల పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ట్రైలర్ ఉంది. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి లాంటి పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. చరణ్, ఎన్టీఆర్ మధ్య ఫ్రెండ్ షిప్ సీన్స్ కూడా చాలా బావున్నాయి. 

click me!