Karthik Deepam: సౌందర్య ఇంట్లో కుడి కాలు పెట్టిన మోనిత.. ఊరు దాటిన వంటలక్క కుటుంబానికి మరో ప్రమాదం?

Navya G   | Asianet News
Published : Dec 09, 2021, 11:20 AM IST

Karthik Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthik Deepam) సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇక ఈరోజు ఏం జరిగిందో ఎపిసోడ్ హైలెట్స్ లో చూద్దాం.  

PREV
19
Karthik Deepam: సౌందర్య ఇంట్లో కుడి కాలు పెట్టిన మోనిత.. ఊరు దాటిన వంటలక్క కుటుంబానికి మరో ప్రమాదం?

దీప (Deepa), కార్తీక్ (Karthik) పిల్లల్ని తీసుకొని రోడ్డుపై నడుస్తూ ఉంటారు.  పిల్లలకు ఏం అర్థం కాకపోయేసరికి ఎక్కడికి వెళ్తున్నామని పదే పదే ప్రశ్నలు వేస్తుంటారు. ఎప్పుడు కార్లో వచ్చేవాళ్ళం కదా ఇప్పుడేంటిలా వస్తున్నాము అంటూ కాలు నొప్పి పుడుతున్నాయని అంటారు.
 

29

ఇక కార్తీక్ (Karthik) బాధపడటంతో దీప వెంటనే వాళ్లను నడిపించడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని చెబుతుంది. హిమ (Hima) ఎక్కడికి వెళ్తున్నాము,  ఎక్కడుంటమని అడగటంతో ఇక్కడే ఉంటామని దీప అంటుంది.
 

39

హిమ (Hima)  తాము ఉండే చోటుని క్లాస్ గా ఉంటుందా అని అడుగుతుంది. మరోవైపు సౌందర్య, ఆనందరావు ఏమి తినకుండా   కార్తీక్ కోసం బాధపడుతుంటారు. శ్రావ్య (Sravya) వచ్చి బతిమాలినా కూడా ఏం తినలేకపోతారు.
 

49

ఇక ఆదిత్య (Aditya) అన్నయ్య వాళ్ల కోసం వెతుకుతున్నాను అంటూ మీరు అలా ఉండకండని వాళ్లను బ్రతిమాలుతాడు. అప్పుడే మోనిత (Monitha) మాట వినిపిస్తుంది. ఇంట్లోకి తొలిసారిగా బిడ్డతో అడుగుపెడుతున్న అంటూ కుడికాలు పెట్టి వస్తుంది.
 

59

ఇక మోనితను (Monitha) చూసి సౌందర్య వాళ్ళు ఏమీ అనలేక పోతారు. మోనిత వచ్చి కార్తీక్ ను పిలుస్తూ ఉంటుంది. వెంటనే ఆదిత్య అన్నయ్య లేడు అని అనేసరికి మోనిత షాక్ అవుతుంది. మోనిత ఆదిత్య (Aditya ) మాటలు నమ్మలేకపోతుంది.
 

69

ఇదంతా మరో కొత్త నాటకం అంటూ మాట్లాడుతుంది.  మీరే ఏదో కొత్త ప్లాన్ చేసి ఇలా చేస్తున్నారని అనేసరికి ఆదిత్య (Aditya ),తనపై కోపంతో రగిలిపోతాడు. ఇదంతా నీ వల్లే జరిగింది అంటూ మా ఇంటి పరువు మొత్తం బయటికి వేశావు అంటూ కోపంతో రగిలిపోతాడు.
 

79

అయినా కూడా మోనిత (Monitha) ఇదంతా నాటకమని అనుకుంటుంది. ఎలాగైనా నేను అసలు నిజం కనుక్కుంటానని అనేసరికి సౌందర్య నిజంగానే కార్తీక్ (Karthik) వెళ్ళిపోయాడని నీకు ఈ ఇంటితో సంబంధం లేదని అంటుంది.
 

89

ఆనందరావు (Anadharao) కూడా మోనితకు ఇదంతా నిజమే అని చెబుతాడు. మోనిత (Monitha) తన మనసులో ఇదంతా నిజమా కాదా అనుకుంటుంది. ఈ ఇంటి కి సంబంధం లేదు అని ఇలా అంటున్నారు అని సౌందర్యతో కాసేపు మాటల యుద్ధం చేస్తూ అక్కడి నుంచి వెళ్లి పోతుంది.
 

99

మరోవైపు దీప (Deepa) వాళ్లు ఒక ఇంటి దగ్గర బయట ఉండగా అక్కడ ఒక ఆవిడ పిలిచి ఆ ఇంటి జోలికి వెళ్లొద్దని అంటుంది. తరువాయి భాగంలో దీప ఒక పెద్దావిడ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. దీనిని బట్టి చూస్తే ఆమె దీప కుటుంబానికి అండగా ఉంటుందని అనిపిస్తుంది.

click me!

Recommended Stories