వరుసగా 5 ఫ్లాపులు, ఈసారి రాయలసీమ అంటున్న వరుణ్ తేజ్..కొత్త ప్రయోగం, హీరోయిన్ ఎవరంటే ?

First Published | Dec 22, 2024, 1:22 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో బ్యాడ్ పీరియడ్ కొనసాగుతోంది. వరుణ్ తేజ్ చివరగా నటించిన 5 చిత్రాలు డిజాస్టర్ అయ్యారు. గని నుంచి మొన్న విడుదలైన మట్కా వరకు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ లో బ్యాడ్ పీరియడ్ కొనసాగుతోంది. వరుణ్ తేజ్ చివరగా నటించిన 5 చిత్రాలు డిజాస్టర్ అయ్యారు. గని నుంచి మొన్న విడుదలైన మట్కా వరకు అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మెగా హీరోకి ఇది మామూలు షాక్ కాదు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్, ఎఫ్ 3, మట్కా చిత్రాలు వరుణ్ తేజ్ కెరీర్ లో ఫ్లాప్ లిస్ట్ లో చేరిపోయాయి. 

వరుణ్ తేజ్ ఇకపై జాగ్రత్త పడకపోతే మార్కెట్ దారుణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ఇటీవల యువ హీరోల చిత్రాలు వర్కౌట్ కాకపోతే వైవిధ్యమైన సూపర్ నేచురల్ అంశాలు ఉన్న కథలు ఎంచుకుంటున్నారు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష చిత్రంతో హిట్ కొట్టాడు. కిరణ్ అబ్బవరం క చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వరుణ్ తేజ్ కూడా రెగ్యులర్ సినిమాలని పక్కన పెట్టి వైవిధ్యమైన కాన్సెప్ట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. 


వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో హర్రర్ చిత్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ వినడానికి వింతగానే ఉంది. ఎవరైనా రాయలసీమ నేపథ్యం ఎంచుకుంటే మాస్ కథలని ఎంచుకుంటారు. 

కానీ వరుణ్ తేజ్ భిన్నంగా హర్రర్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా యంగ్ బ్యూటీ రితిక నాయక్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా హిట్ కోసం వరుణ్ తేజ్ తన పంథా మార్చారు. జనవరిలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

రితిక నాయక్ అశోక వనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న చిత్రాల్లో నటించింది. సోషల్ మీడియాలో ఈ యంగ్ బ్యూటీ బాగా పాపులర్ అయింది. క్యూట్ లుక్స్ తో రితిక కట్టిపడేస్తుంది. 

Also Read: వెంకీ టార్గెట్ వెరీ క్లియర్, ఇద్దరు హీరోయిన్లతో రచ్చ .. రాంచరణ్, బాలయ్యకి చెమటలు పట్టించేలా జోరు

Latest Videos

click me!