స్టార్‌ హీరోయిన్‌కి యాంకర్‌ ప్రదీప్‌ లవ్‌ లెటర్‌, ఛాన్స్ దొరికిందని రెచ్చిపోయాడు.. ఆమె రియాక్షన్‌ క్రేజీ

First Published | Dec 22, 2024, 1:11 PM IST

యాంకర్‌ ప్రదీప్‌ తన జీవితంలో మొదటి సారి లవ్‌ లెటర్‌ రాశాడు. అయితే అది ఓ హీరోయిన్‌కి. మామూలు హీరోయిన్‌ కాదు, ఓ స్టార్‌ హీరోయిన్‌కి కావడం విశేషం. మరి ఆకథేంటో చూస్తే, 

యాంకర్‌ ప్రదీప్‌ తెలుగులో మేల్‌ యాంకర్స్ లో టాప్‌లో నిలిచాడు. స్టార్‌ యాంకర్‌గా రాణించాడు. సరిగమప, కొంచెం టచ్‌ లో ఉంటే చెబుతా వంటి షోస్‌తో తన మార్క్ ని చూపించాడు. తనదైన యాంకరింగ్‌తో అలరించాడు. ఇప్పుడు యాంకరింగ్‌ మానేసి సినిమాల వైపు వెళ్తున్నాడు. ఆ మధ్య ఓ సినిమాతో హీరోగా మెప్పించాడు. ఇప్పుడు మరో సినిమాలో హీరోగా చేస్తున్నాడు. 

read more: `పుష్ప 2` ఓటీటీ రైట్స్ అన్ని కోట్లా? నిర్మాతలకు డబుల్‌ బొనాంజా !

photo credit- zee telugu

ఇదిలా ఉంటే యాంకర్‌ ప్రదీప్‌ షోస్‌లో గెస్ట్ లతో నవ్వులు పూయించడం, సర్‌ప్రైజ్‌ చేయడం చేస్తుంటాడు. షోని రక్తికట్టిస్తుంటాడు. అయితే హీరోయిన్లు అయితే మరింతగా రెచ్చిపోతాడు. వాళ్లు ఛాన్స్ ఇస్తే మరింతగా దూసుకుపోతాడు. ఇంకా పెళ్లి చేసుకోని యాంకర్‌ ప్రదీప్‌ ఓ స్టార్‌ హీరోయిన్‌తో చేసిన చిలిపి పని ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఆమెకి లవ్‌ లెటర్‌ రాయడం ఆసక్తికరంగా మారింది. టూ క్రేజీగా మారి వైరల్‌ అవుతుంది. 
 


photo credit- zee telugu

యాంకర్‌ ప్రదీప్‌ తన జీవితంలో మొదటిసారి లవ్‌ లెటర్ రాశాడట. అది కూడా ఓ స్టార్‌ హీరోయిన్‌కి అని చెప్పాడు. మరి ఆ హీరోయిన్‌ ఎవరో కాదు రింగుల జుట్టుతో కుర్రకారుని తన బుట్టలో పడేసుకుంటున్న అనుపమా పరమేశ్వరన్‌ కావడం విశేషం. అనుపమా మల్టీ టాలెంటెడ్‌.

`అ ఆ` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేసింది. `ప్రేమమ్‌`తో మంత్రముగ్దుల్ని చేసింది. కుర్రాళ్ల డ్రీమ్‌ గర్ల్ అయ్యింది. చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న అనుపమా ఇటీవల `టిల్లు స్వ్కేర్‌` చిత్రంలో లిల్లీగా నటించి మెస్మరైజ్‌ చేసింది. గ్లామర్ సైడ్‌ ఓపెన్‌ అయ్యింది. 
 

photo credit- zee telugu

ఒకప్పుడు ట్రెడిషన్‌కి పెద్ద పీఠ వేసిన అనుపమా పరమేశ్వరన్‌ ఇప్పుడు గ్లామర్‌ షోకి గేట్లు ఎత్తేసి ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. ఆమె ఆ మధ్య ప్రదీప్‌ యాంకర్‌గా చేస్తున్న `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` షోకి వెళ్లింది. అందులో తన స్కూల్‌ డేట్‌ మెమొరీస్‌ని పంచుకుంది.

తనకు ఒకటి రెండు లవ్‌ లెటర్స్ తప్పితే పెద్దగా ఎవరూ లవ్‌ లెటర్స్ రాయలేదని, ఆ లెటర్స్ కూడా సీరియస్‌గా రాసేవారు కాదని, అదే బాధగా ఉండేదని చెప్పింది అనుపమా. అయితే చాలా మంది తన వెంటపడేవారని, తాను కోప్పడంతో వెళ్లిపోయేవారని చెప్పింది అనుపమా పరమేశ్వరన్‌. 
 

photo credit- zee telugu

ఇది విన్న యాంకర్‌ ప్రదీప్‌.. ఛాన్స్ తీసుకున్నాడు. అనుపమా పరమేశ్వరన్‌కి పొయెటిక్‌గా, రొమాంటిక్‌గా లవ్‌ లెటర్‌ రాశాడు. షోలోనే ఆమెకి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు. తన మీద గులాబీ పూల రేకులు చల్లుతూ ఆమెకి లవ్‌ లెటర్‌ని ఇచ్చాడు. అయితే ఇది తెలుగులో రాయడంతో అనుపమాకి అర్థం కాలేదు.

దీంతో తనే చదివి వినిపించాడు. `ప్రియమైన అను, ప్రేమతో మీ ప్రదీప్‌ మీ నవ్వు అద్భుతం. మీ నడక అద్భుతం. మీ చూపు అద్భుతం. మీరే అద్భుతం. ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా` అని లవ్‌ ప్రపోజ్‌ చేశాడు యాంకర్ ప్రదీప్‌. 
 

photo credit- zee telugu

దీనికి అనుపమా పరమేశ్వరన్‌ ఫిదా అయ్యింది. థ్యాంక్యూ సో మచ్‌ అని, ది మోస్ట్ వండర్‌ఫుల్‌ లవ్‌ లెటర్‌ అంటూ కితాబిచ్చింది. దీంతో ప్రదీప్‌ ఫుల్‌ ఖుషీ అయ్యాడు. థ్యాంక్యూ చెబుతూ, లవ్‌ యూ టూ అని చెప్పడం. `కొంచెం టచ్‌లో ఉంటే చెబుతా` షోలో భాగంగా ఆయన సరదాగా ఇలా ప్రపోజ్‌ చేశాడు. ఇది ఆద్యంతం ఆకట్టుకునేలా, బ్యూటీఫుల్‌గా, క్యూట్‌గా ఉండటం విశేషం.

దీన్ని అనుపమా కూడా అంతే పాజిటివ్‌గా తీసుకుని ఆ సందర్భాన్ని రక్తికట్టేలా చేసింది. ఇది ఓల్డ్ చిట్‌కి  సంబంధించినది కావడం విశేషం. అయితే ఇది ప్రదీప్‌ రాసిన మొదటి ప్రేమ లేఖ అట. ఇప్పటి వరకు ఎవరికీ తాను లవ్‌ లెటర్‌ రాయలేదని చెప్పడం విశేషం. మొదటి లెటర్‌ ఓ స్టార్‌ హీరోయిన్‌కి రాయడం మరో విశేషం. 
 

photo credit- zee telugu

ఇక యాంకర్‌ ప్రదీప్‌ ఆ మధ్య `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` అనే సినిమా తీసి హిట్‌ కొట్టాడు. ప్రస్తుతం ఆయన పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌తో వస్తున్నాడు. `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` పేరుతో సినిమా చేస్తున్నాడు. ఒక కొత్త తరహా లవ్‌ స్టోరీ మూవీ కావడం విశేషం.

దీనికి నితిన్‌, భరత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఇదిలా ఉంటే ఆ మధ్య పెళ్లి రూమర్లు వచ్చాయి. ఏపీలోని కూటమికి చెందిన ఒక యంగ్‌ లేడీ ఎమ్మెల్యేని ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. 

also read: ప్రభాస్‌కి బాగా నచ్చిన మాస్‌ సాంగ్‌, ఏ హీరో సినిమాదో తెలిస్తే మతిపోవాల్సిందే, కృష్ణంరాజు కాదు

Latest Videos

click me!