టాలీవుడ్ లో ఒకవైపు వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. మరోవైపు సంక్రాంతి చిత్రాల సందడి మొదలైంది. ఈ సంక్రాంతికి గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. రాంచరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకు మహారాజ్ చిత్రాలు భారీ స్పాన్ ఉన్న మాస్ చిత్రాలు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మాత్రం క్లాస్ మూవీ గా రిలీజ్ అవుతోంది.