పవన్ కళ్యాణ్ నటించిన `ఓజీ` మూవీతో వరుణ్ తేజ్ నటించిన `కొరియన్ కనకరాజు` మూవీని పోల్చుతూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తాజాగా దీనిపై వరుణ్ తేజ్ స్పందించారు. అసలు విషయం వెల్లడించారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు `కొరియన్ కనకరాజు` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఈరోజు(గురువారం) సాయంత్రం నుంచి ప్రీమియర్స్ ప్రదర్శించబడుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా నటించింది. సత్య కీలక పాత్ర పోషించాడు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రమిది. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. సినిమాకి పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ `ఓజీ`తో పోల్చుతున్నారు.
24
ఓజీతో పోలికపై వరుణ్ తేజ్ క్లారిటీ
తాజాగా దీనిపై వరుణ్ తేజ్ స్పందించాడు. కళ్యాణ్ బాబాయ్ అభిమానులను చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా `ఓజీ`. అందులో జపనీస్ టచ్ ఉంది. అందుకే కొంతమందికి అలాంటి పోలిక అనిపించి ఉండొచ్చు. కానీ మా సినిమాకు 'OG'తో ఎలాంటి సంబంధం లేదు` అని తెలిపాడు వరుణ్. కొరియన్ భాష, లుక్ గురించి ఆయన మాట్లాడుతూ, కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. అదొక ఎగ్జైట్‌మెంట్ ఫీలింగ్. ఈ మూవీ విషయంలో కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడాన్ని బాగా ఎంజాయ్ చేశాను. క్యారెక్టర్ డిజైన్ విషయంలో చాలా ప్లాన్ చేశాం. హెయిర్‌స్టైల్ పూర్తిగా కొరియన్ లుక్‌లో ఉండాలని నిర్ణయించుకున్నాం. కొరియన్లకు స్ట్రైట్, సిల్కీ హెయిర్ ఉంటుంది. అందుకే మొదటిసారి జుట్టుకు కలర్ కూడా వేశాను. మనకు ఆ స్టయిల్ వింతగా అనిపించొచ్చు. కానీ కొరియాలో షూటింగ్‌కు వెళ్లినప్పుడు అదే హెయిర్‌స్టైల్‌తో చాలామందిని చూశాను` అని చెప్పాడు.
34
కామెడీ చేయడం కష్టం ఏం కాదు
ఫైనల్ అవుట్‌పుట్ చూసిన తర్వాత తన అభిప్రాయం చెబుతూ, దర్శకుడు మేర్లపాక గాంధీ మొదటి నుంచే `ఈ స్టైల్‌లో ఇప్పటివరకు మీరు కనిపించలేదు` అని చెప్పేవాడు. 'F2', 'F3'లో కామెడీ చేసినా, ఇందులో నా పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో రెండు డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు వరుణ్ తేజ్ కనిపించకూడదు... 'కనకరాజు' మాత్రమే కనిపించాలి, నన్ను కనకరాజు పేరుతో పిలిచేంతగా ఆ పాత్రలో ట్రాన్స్‌ఫర్మ్ కావాలని ప్రయత్నం చేశాను. నిజానికి ఒక నటుడు అన్ని రకాల పాత్రలు చేయాలి. నేను అన్ని రకాల పాత్రలు చేస్తాను. పొడవుగా ఉండే హీరోలు కామెడీ చేయకూడదనే ఒక అభిప్రాయం ఉంది. అది సరైనది కాదు. పాత్రను సరిగ్గా రాస్తే కామెడీ కుదురుతుంది. 'కొరియన్ కనకరాజు'లో కామెడీ తో పాటు యాక్షన్ కూడా చాలా బాగా కుదిరింది.
సత్యతో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. మేమిద్దరం కలిసి చేస్తున్న మూడో సినిమా ఇది. సత్యను కేవలం కమెడియన్‌గా మాత్రమే చూడకూడదు. తనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రలు చాలా కీలకం. ప్రేక్షకులు ఆ రెండు పాత్రలతో కనెక్ట్ కావాలంటే మేమిద్దరం చాలా హోమ్‌వర్క్ చేశాం. రాయలసీమ యాస నేర్చుకుని, కామెడీ టైమింగ్‌పై ప్రత్యేకంగా వర్క్ చేశాం. ఆ కసరత్తు సినిమాలో బాగా వర్కౌట్ అయింది. మా ఇద్దరి కెమిస్ట్రీని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు` అని చెప్పారు వరుణ్ తేజ్. మొత్తంగా ఈ మూవీతో హిట్ కొట్టబోతున్నామనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు.