Varun Tej: ఒకవైపు చెల్లి, మరోవైపు తండ్రి.. కెరీర్ లో తొలిసారి నాగబాబుతో నటించబోతున్న వరుణ్ తేజ్

Published : Aug 06, 2026, 02:15 PM IST

వరుణ్ తేజ్ నటిస్తున్న 'బరి' చిత్రంలో నాగబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రి, కొడుకు తొలిసారి ఒకే సినిమాలో నటించబోతుండటంతో మెగా అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

PREV
15
Varun Tej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. థియేటర్లలో విడుదలకు ముందే ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై మంచి ప్రీ-రిలీజ్ బజ్ నెలకొనగా, తొలి షోల నుంచి పాజిటివ్ టాక్ వస్తే సినిమా మరింత బలమైన విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.

25
కెరీర్ లో తొలిసారి తండ్రితో వరుణ్ తేజ్

ఇదిలా ఉండగా, తన తదుపరి చిత్రం 'బరి' గురించి వరుణ్ తేజ్ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చారు. అమెరికాలోని ఎన్నారై ప్రేక్షకులతో జరిగిన ఓ ఇంటరాక్షన్‌లో మాట్లాడిన ఆయన, ఈ సినిమాలో తన తండ్రి నాగబాబు కొణిదెల కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అంతేకాదు, తండ్రి, కొడుకు ఇద్దరూ తొలిసారి ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఈ ప్రాజెక్ట్ మెగా అభిమానులకు మరింత ప్రత్యేకంగా మారింది.

35
ఆసక్తి పెంచుతున్న బరి మూవీ

నాగబాబు ఈ సినిమాలో భాగమవుతున్నట్లు వరుణ్ తేజ్ స్వయంగా ప్రకటించడంతో 'బరి మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. వరుణ్ తేజ్ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి తన తండ్రి నాగబాబుతో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.

45
వాలీబాల్ ప్లేయర్ గా వరుణ్ తేజ్

ఈ చిత్రానికి జాతీయ అవార్డు అందుకున్న తెలుగు చిత్రం 'కమిటీ కుర్రోళ్లు' దర్శకుడు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ వాలీబాల్ క్రీడాకారుడి పాత్రలో కనిపించనున్నారు. క్రీడా నేపథ్యంతో పాటు భావోద్వేగాలకు కూడా కథలో ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.

55
నిర్మాతగా నిహారిక కొణిదెల

'బరి' చిత్రాన్ని నిహారిక కొణిదెల తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఒక వైపు తన చెల్లి నిహారిక ఈ చిత్రాన్ని నిర్మాతగా నిర్మిస్తుండగా.. మరో వైపు తన తండ్రి కీలక పాత్రలో నటించనుండడం ఆసక్తికర అంశం. వరుణ్ తేజ్ కి ఇది క్రేజీ కాంబినేషన్ అనే చెప్పాలి. చెల్లి, తండ్రి భాగమైన ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని ఇస్తోంది చూడాలి. అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.

Read more Photos on
click me!

Recommended Stories