అఖిల్ హీరోగా రూపొందిన `లెనిన్` మూవీకి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, నాగవంశీ నిర్మించారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ప్రమోద్, శివాజీ, ఈశ్వరీరావు, రాంకీ, గెటప్ శ్రీను వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. జులై 10న విడుదలైన ఈ చిత్రానికి ప్రారంభంలో మిశ్రమ స్పందన లభించింది. రెగ్యూలర్ కమర్షియల్ మూవీ అనే టాక్ వచ్చింది. కానీ మాస్ ఎలిమెంట్లు, యాక్షన్ సీన్లు బాగుండటంతో ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఫస్ట్ రెండు వారాలు మంచి వసూళ్లని రాబట్టింది.