కళాభినేత్రిగా తెలుగు చిత్ర పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్న వాణిశ్రీ గురించి పరిచయం అవసరం లేదు. ఆమె నటనలో తప్పకుండా ఒక లెజెండ్. కళ్ళతోనే హావభావాలు పలికిస్తూ.. గడుసరిగా నటించడం వాణిశ్రీకే చెల్లింది. వాణిశ్రీ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు లాంటి హీరోలందరితో నటించింది.ఆ తర్వాతి తరం హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున చిత్రాల్లో తల్లి, అత్త తరహా పాత్రలు చేసింది.