చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కొణిదెల మొదటి వివాహం అప్పట్లో టాక్ ఆఫ్ ది నేషన్ అయ్యింది. ఆమె శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని 2007లో ప్రేమ వివాహం చేసుకుంది. ఎవరికీ తెలియకుండా ఆర్యసమాజ్ లో శిరీష్ ని పెళ్లి చేసుకుని శ్రీజ మీడియా ముందుకు వచ్చింది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది. శ్రీజ తీరు కుటుంబ సభ్యులను ఆందోళనకు గురి చేసింది. శ్రీజ దంపతులకు నివృతి అనే కూతురు జన్మించింది. కొంతకాలం తర్వాత శ్రీజ - శిరీష్ మధ్య విభేదాలు తలెత్తాయి.