ఈ సినిమాకి హీరోగా ఆనంద్ దేవరకొండని తాను తీసుకున్నట్టు తెలిపారు. ఆనంద్ తన ఛాయిస్ అన్నాడు. కాకపోతే వైష్ణవిని ముందు అనుకోలేదని తెలిపారు. నిర్మాత నాగవంశీనే ఆమె పేరుని సజెస్ట్ చేశాడని, బేబీ జోడీ బాగుంటుందన్నారు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఎంపిక చేవారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే మొదట ఒత్తిడిగా అనిపించింది. ఆ తర్వాత ఓకే హ్యాండిల్ చేయోచ్చు, దాన్ని మించి చేయోచ్చు అనే ఫీలింగ్ కలిగిందన్నారు. ట్రైలర్‌లో చూపించినట్టు రొమాన్స్ మాత్రమే కాదు, వాళ్ల జర్నీ ఉంటుంది. హీరోహీరోయిన్ల పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా సాగుతుంది. రెండు పాత్రలను బ్యాలెన్స్ చేశాను. అలాగే క్యాస్ట్, మతాల గురించి ఒక స్టేట్‌మెంట్ ఉండదు, సరదాగా కొన్ని డైలాగ్‌లు పెట్టాం. దీనికితోడు సినిమాలో రొమాన్స్ మాత్రమే కాదు కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొంత రియల్ లైఫ్ కనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఫన్, లవ్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ మేళవింపుగా మూవీ ఉంటుందన్నారు.