Movie Interval : సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు ఇస్తారు? దీని వెనుక పెద్ద కథే ఉంది!

Published : Sep 07, 2026, 08:49 PM IST

పాతకాలంలో మొదలైన ఇంటర్వెల్ కల్చర్ డిజిటల్ యుగం వచ్చినా భారతీయ సినిమాను వదల్లేదు. అసలు సినిమా మధ్యలో ఇంటర్వెట్ ఎందుకు ఇస్తారు? దీని వెనకున్న ఆసక్తికర స్టోరీ గురించి తెలుసుకుందాం.

PREV
15
సినిమా ఇంటర్వెల్ వెనక ఆసక్తికర స్టోరీ

థియేటర్‌లో సినిమాకు వెళ్లిన ప్రతిసారి చాలామందికి ఓ డౌట్ రావడం ఖాయం… అసలు సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకిస్తారని. కథలో బాగా లీనమై చూస్తుండగా తెరపై "INTERVAL" అని పడుతుంది… ఇది కొందరికి ఇది పాప్‌కార్న్ టైమ్… మరికొందరికి వాష్‌రూమ్ బ్రేక్. కానీ ఇంటర్వెల్ కేవలం విరామం మాత్రమే కాదు. భారతీయ సినిమా కథనంలో దీనికో ప్రత్యేక స్థానం ఉంది.

25
సినిమా మధ్యలో ఇంటర్వెల్ ఎందుకు?

ఇప్పటి డిజిటల్ ప్రొజెక్టర్ల కాలంలో సినిమా వేయడానికి రీళ్లు మార్చాల్సిన పనిలేదు. కానీ ఒకప్పుడు సినిమాలను పెద్ద పెద్ద ఫిల్మ్ రీళ్లలో ప్రదర్శించేవారు. పొడవైన సినిమాల్లో ఒక రీల్ అయిపోగానే, ప్రొజెక్షనిస్ట్ మరో రీల్ పెట్టడానికి సమయం పట్టేది. అందుకే సినిమా మధ్యలో విరామం ఇచ్చే పద్ధతి మొదలైంది. టెక్నాలజీ పెరిగి డిజిటల్ యుగం వచ్చినా ఇండియాలో ఇంటర్వెల్ మాత్రం పోలేదు. ఇది మన సినిమా సంస్కృతిలో భాగమైపోయింది.

35
ఇంటర్వెల్ పై ఎందుకంత ఇంట్రెస్ట్?

ఇంటర్వెల్ అనేది సినిమా లవర్స్‌కు చాలా ఆసక్తికరమైన విషయం. చాలా భారతీయ సినిమాల్లో ఇంటర్వెల్‌కు కొన్ని నిమిషాల ముందు పెద్ద ట్విస్ట్, షాకింగ్ సంఘటన, ఫైట్ లేదా ఊహించని సీన్ పెడతారు. దీన్నే అభిమానులు "ఇంటర్వెల్ బ్లాక్" అని పిలుస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో పెంచడమే దీని ఉద్దేశం.

45
ఇంటర్వెల్ తో లాభమా..!

ఇంటర్వెల్ కేవలం ప్రేక్షకులు సేద తీరడానికే కాదు. థియేటర్లకు ఆదాయం తెచ్చిపెట్టే కీలక సమయం కూడా. ఈ బ్రేక్‌లో జనం పాప్‌కార్న్, జ్యూస్, కాఫీ, సమోసా లాంటివి కొంటారు. దీంతో థియేటర్ల బిజినెస్ పెరుగుతుంది. అంతేకాదు ఎక్కువసేపు కూర్చున్న ప్రేక్షకులకు కాస్త రిలాక్స్ అవ్వడానికి, వాష్‌రూమ్‌కి వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది.

55
హాలివుడ్ సినిమాలకూ ఇంటర్వెల్

చాలా దేశాల్లో ఇప్పుడు సినిమాలను విరామం లేకుండా ప్రదర్శిస్తున్నారు. డిజిటల్ ప్రొజెక్టర్లు వచ్చాక రీళ్లు మార్చే అవసరం కూడా తప్పింది. కానీ మన దేశంలో మాత్రం ఇంటర్వెల్ అనేది ప్రేక్షకుల అంచనాగా, థియేటర్ల వ్యాపార పద్ధతిగా కొనసాగుతోంది. అందుకే కొన్ని హాలీవుడ్ సినిమాలకు కూడా భారతీయ థియేటర్లలో ఇంటర్వెల్ ఇస్తుంటారు. కానీ ఆ సినిమాలను ఇంటర్వెల్‌ను దృష్టిలో పెట్టుకుని తీయరు. అందుకే కొన్నిసార్లు ముఖ్యమైన సీన్ మధ్యలో సినిమా ఆపేయడంతో ప్రేక్షకులకు చిరాకు వస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories