ఊర్వశి రౌటేలా పై పూజారుల ఆగ్రహం, గుడి కట్టాలన్న వ్యాఖ్యలపై విమర్శలు

Published : Apr 19, 2025, 06:42 PM ISTUpdated : Apr 19, 2025, 06:43 PM IST

రీసెంట్ గా  నటి ఊర్వశి రౌటేలా చేసిన వ్యాఖ్యలు  పెద్ద దుమారాన్ని రేపాయి.  ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఓ ఆలయం ఉందని, సౌత్ లో కూడా తనకు టెంపుల్ కట్టాని ఆమె అన్నారు. అయితే  ఆమె చెప్పిందంతా అబద్ధమని, అది పార్వతీ దేవి ఆలయమని తేలింది. ఈ విషయంలో పూజారులు కూడా ఊర్వశిపై మండిపడ్డారు.   

PREV
15
ఊర్వశి రౌటేలా పై పూజారుల ఆగ్రహం,  గుడి కట్టాలన్న వ్యాఖ్యలపై విమర్శలు

ఊర్వశి రౌటేలా, 'ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఊర్వశి అనే ఆలయం ఉంది. బద్రీనాథ్ ఆలయం పక్కనే ఉంటుంది' అని  అన్నారు.ఈ వ్యాక్యలు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం రేపాయి. 

Also Read: మోహాన్ బాబు కాలర్ పట్టుకుని, గెట్ అవుట్ అన్న సీనియర్ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?

25

అక్కడితో ఆగకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో త చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్యతో కలిసి పనిచేశాను. వారికి మాదిరిగానే  నాకూ ఆలయం కావాలి అని ఊర్వశి అన్నారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎన్నో విమర్శలకు కూడా దారి తీసింది. 

Also Read: బిగ్ బాస్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్, ఈసారి సీజన్ లేనట్టే, కారణం ఏంటో తెలుసా?

35

బద్రీనాథ్ దగ్గర నా పేరు మీద ఆలయం ఉంది, ప్రజలు ప్రార్థిస్తారు. నన్ను దండమా మాయి అంటారు అని ఊర్వశి చెప్పారు. కాని ఇందులో ఏమాత్రం నిజం లేదని తేలింది. ఊర్వశి ఆలయం ఉండటం నిజమే. కానీ అది ఊర్వశి రౌటేలాది కాదు, దేవి ఊర్వశిది అని పూజారులు స్పష్టం చేశారు.

Also Read:  కొత్త కారు కొన్న ఏ.ఆర్.రెహమాన్ , కాస్ట్ ఎంతో తెలుసా?

45

ఊర్వశి దేవాలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని బామ్ని గ్రామంలో ఉంది. బద్రీనాథ్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. సతి దేవికి ముక్తిని ప్రసాదించడానికి ఆమె శరీరాన్ని ముక్కలు చేశారు. ఊర్వశి దేవాలయం ఉన్న చోట సతి దేవి శరీర భాగం పడిందని చెబుతారు.

55
ఊర్వశి రౌటేలా

విష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తొడ నుండి ఊర్వశి అనే అప్సరస పుట్టింది. ఆమెను మా ఊర్వశి దేవిగా పూజిస్తారు. స్థానిక భక్తులు మా ఊర్వశి దేవాలయాన్ని సందర్శిస్తారు. దేవి ఆలయాన్ని ఒకరి పేరుతో ముడిపెట్టడం సరికాదు అని పూజారులు అంటున్నారు. ఊర్వసి వ్యాఖ్యాలపై వారు మండిపడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories