Upasana Baby Bump: బేబీ బంప్‌తో ఉపాసన, ఫోటో వైరల్‌.. భార్యకి రామ్‌ చరణ్‌ స్పెషల్‌ బిర్యానీ ట్రీట్‌

Published : Jan 05, 2026, 09:58 PM IST

Upasana Baby Bump: రామ్‌ చరణ్‌ ప్రెగ్నెంట్‌తో ఉన్న తన భార్యకి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రుచికరమైన బిర్యానీని తినిపించారు. ఈ సందర్భంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

PREV
15
రెండోసారి తల్లి కాబోతున్న ఉపాసన

ఉపాసన రెండో సారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. రామ్‌ చరణ్‌, ఉపాసన దంపతులు రెండేళ్ల క్రితం కూతురు క్లింకారకి జన్మనిచ్చారు. ఇప్పుడు రెండు సారి పేరెంట్స్ కాబోతున్నారు. పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్‌తో ఉన్నారు. ఆ మధ్యనే ఆమెకి సీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్‌ దంపతులు, నయనతార దంపతులు, వరుణ్‌ తేజ్‌ జంట, ఇలా మెగా ఫ్యామిలీ పాల్గొన్నారు. ఆ వేడుకకి సంబంధించిన వీడియో వైరల్‌ అయ్యింది.

25
బేబీ బంప్‌తో ఉపాసన

ప్రస్తుతం ఉపాసన బేబీ బంప్‌తో ఉన్నది. తాజాగా బేబీ బంప్‌తో దర్శనమిచ్చింది ఉపాసన. మెగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసింది. సీమంతం తర్వాత  బయట ఎక్కడా పెద్దగా కనిపించలేదు ఉపాసన. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆమె కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ బేబీ బంప్‌ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

35
రామ్‌ చరణ్‌ ఇంట్లో జపాన్‌ బిర్యానీ స్పెషలిస్ట్ చెఫ్‌

రామ్‌ చరణ్‌.. తన ఇంటికి ప్రముఖ జపాన్‌ బిర్యానీ చెఫ్‌ తకామసా ఒసావాని ఆహ్వానించాడు. ఈ సందర్భంగా చరణ్‌ ఫ్యామిలీ కోసం ఘుమ ఘుమలాడే బిర్యానీని వండి వడ్డించారు. దీన్ని రామ్‌ చరణ్‌తోపాటు అమ్మ సురేఖ, ఉపాసన, ఇతర కుటుంబ సభ్యులు తింటూ ఆస్వాదించారు. అందులోనూ చరణ్‌ ఆ బిర్యానీ స్పెషాలిటీని వివరించడం విశేషం. బిర్యానీ ఎలా ఉందో చెబుతూనే, ఎంతో టేస్ట్ ఉందనే విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌,  ఫోటోలను ఈ జపాన్‌ చెఫ్‌ పంచుకోగా, అవిప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రామ్‌ చరణ్‌ ఇంట్లో బిర్యానీ వండటం చాలా సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. వంట చేసేఫోటోలను, చరణ్‌ పిక్స్ ని, ఆయన పెట్‌ డాగ్‌ ఫోటోలను కూడా ఒసావా పంచుకోవడం విశేషం.

45
ట్విన్స్ కి జన్మనివ్వబోతున్న ఉపాసన?

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్‌కి సంబంధించిన ఆసక్తికర సమాచారం సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఆమె ట్విన్స్ కి జన్మనివ్వబోతుందట. ఆ మధ్య సీమంతం సమయంలోనే ఉపాసన ఈ విషయాన్ని పంచుకుంది. డబుల్‌ సర్‌ప్రైజ్‌, డబుల్‌ హ్యాపీనెస్‌ అంటూ పేర్కొంది. దీంతో తనకు పుట్టబోయేది ట్విన్స్ అనే విషయాన్ని ఉపాసన ఇలా ప్రకటించిందని నెటిజన్లు కన్ఫమ్‌ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.

55
పెద్ది తో రాబోతున్న రామ్‌ చరణ్‌

ఇక రామ్‌ చరణ్‌ ప్రస్తుతం `పెద్ది` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించింది. పీరియాడికల్‌ స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఈ ఏడాది మార్చిలో సమ్మర్‌ స్పెషల్‌గా విడుదల కాబోతుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories